ఆదివారం, జూలై 21, 2024
Homeహెల్త్పళ్ళను తెల్లగా మార్చుకోవడానికి ఉపయోగపడే చిట్కాలు..

పళ్ళను తెల్లగా మార్చుకోవడానికి ఉపయోగపడే చిట్కాలు..

ఈ రోజుల్లో చాలా వరకు ఎక్కడ  చుసినా పెద్దా,  చిన్నా తేడా లేకుండా అందరికి పళ్ళ సమస్యలు వస్తున్నాయి. వాటిలో పళ్ళు పసుపుబారిపోవడం ఒకటి. ఈ సమస్య తో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు.

దాన్ని తగ్గించుకోవడం కోసం రకరకాల కెమికల్స్ కలిసిన సోలుషన్స్ వాడుతూ ఉంటారు. తర్వాత వాటి వల్ల కలిగే ఎఫెక్ట్స్ వల్ల   భాదపడుతుంటారు. అటువంటి భాద లేకుండా కొన్ని హోమ్ రెమెడీస్ ద్వారా ఈ సమస్య నుంచి ఎలా బయట పడగలమో ఇప్పుడు తెలుసుకుందాం.

  1. కొబ్బరి నూనె.

ఈ సమస్య రావటానికి ముఖ్య కారణం బాక్టీరియా కూడా అయ్యుండొచ్చు. దాన్ని తొలిగించడానికి కొబ్బరి నూనె నోట్లో పోసుకొని పళ్ళ చివర్ల వరకు చేరేలా చూసుకోవాలి. అలా రోజూ 15-20 నిమిషాల పాటు చేయడం వల్ల నోట్లో బాక్టీరియా పోతుంది.

  1. బేకింగ్ సోడాతో బ్రష్ చేయడం.

తక్కువ మోతాదుగా బేకింగ్ సోడా మరియు నీటితో చేసిన పేస్ట్ తో  బ్రష్ చేయడం వల్ల మీ నోటిలోని బ్యాక్టీరియా తగ్గుతుంది మరియు పైన ఉన్న మరకలను దూరం చేస్తుంది. దీని వల్ల పళ్ళు తెల్లబడే అవకాశం ఉంది.

  1. హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడాలి.

హైడ్రోజన్ పెరాక్సైడ్ ఒక సహజ బ్లీచింగ్ ఏజెంట్ మరియు మీ నోటిలోని బ్యాక్టీరియాను చంపగలదు. మీరు దీన్ని మౌత్ వాష్ గా ఉపయోగించవచ్చు లేదా బేకింగ్ సోడాతో కలిపితే టూత్ పేస్టుగా ఏర్పడుతుంది. దానితో మౌత్ వాష్ చేసుకోవడం వల్ల పళ్ళు తెల్లగా మారుతాయి. దీనిని తగు మోతాదుగా మాత్రమే వాడాలి. దీనిని వాడేముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.

  1. ఆపిల్ సైడర్ వెనిగర్ వాడండి.

ఆపిల్ సైడర్ వెనిగర్ యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది, ఇది మీ దంతాలను తెల్లగా మార్చడానికి సహాయపడుతుంది. అయితే వెనిగర్ యొక్క అధిక వినియోగం మీ పంటి ఎనామెల్‌ను కూడా క్షీణిస్తుంది, కాబట్టి దాని వాడకాన్ని వారానికి కొన్ని సార్లు మాత్రమే ఉపయోగించండి.

5.  పండ్లు మరియు కూరగాయలు తింటూ ఉండాలి.

కొన్ని పండ్లలో (pine apple, strawberry) కాల్షియమ్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల అవి  పళ్ళు తెల్లబడటానికి సహాయపడే లక్షణాలు కలిగి  ఉంటాయి. మీ దంతాలు ప్రకాశవంతంగా కనిపించేలా చేయడానికి పచ్చి పండ్లు మరియు కూరగాయలను క్రమం తప్పకుండా తీసుకోవాలి.

  1. పళ్ళ మీద స్టెయిన్స్ పడకుండా కాపాడుకోవాలి.

తగినంత కాల్షియం ఉన్న ఆరోగ్యకరమైన ఆహారం మీ దంతాలు పసుపు రంగులోకి రాకుండా చేస్తుంది. మీరు తిన్న వెంటనే పళ్ళు తోముకోవడం కూడా మరకలను నివారించడంలో సహాయపడుతుంది.

  1. బ్రషింగ్ మరియు ఫ్లాసింగ్.

రోజు ప్రొద్దున మరియు సాయంత్రం రెండు పూటలా బ్రష్ చేసుకోవడం, మరియు ఫ్లాసింగ్ చేసుకోవడం వల్ల పళ్ళ పై పసుపు రంగులో ఉన్న ప్లేక్ పోతుంది. దానివల్ల మన పళ్ళు పసుపు రంగులో నుంచి తెలుపులోకి మారే అవకాశం ఉంది.

ఇప్పుడు చెప్పుకున్న టిప్స్ అన్ని మన పళ్ళు తెల్లబడటానికి చాలా బాగా ఉపయోగపడతాయి.

పళ్ళు తెల్ల పడాలని కోరుకునే ప్రతి ఒక్కరు పైన చెప్పుకున్న టిప్స్ ను పాటించండి. తప్పక మార్పులు కనబడతాయి.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular