ఆదివారం, మే 26, 2024
Homeరాజకీయంనారా లోకేష్ అరెస్ట్.. గుంటూరులో ఉద్రిక్తత... పోలీసుల తీరుపై టీడీపీ నేతల ఆగ్రహం

నారా లోకేష్ అరెస్ట్.. గుంటూరులో ఉద్రిక్తత… పోలీసుల తీరుపై టీడీపీ నేతల ఆగ్రహం

గుంటూరులో రమ్య హత్య వ్యవహారంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి నేడు టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని పోలీసులు గుంటూరులో అదుపులోకి తీసుకున్నారు. గుంటూరులో రమ్య హత్యకు గురి కావడంతో రమ్య కుటుంబాన్ని నేడు పరామర్శించటానికి  వెళ్ళిన నారా లోకేష్ ను పోలీసులు అరెస్టు చేసి పతిపాడులోని పోలీస్ స్టేషన్ కి తరలించారు. అయితే ఈరోజు ఉదయం గుంటూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

 రమ్యను చంపిన వారిని వెంటనే శిక్షించాలంటూ అంతేకాక కోటి రూపాయల నష్ట పరిహారం ప్రకటించాలంటూ ఆందోళనలు చేసారు. దళిత సంఘాలు ఆందోళన తీవ్రం చేయడంతో అక్కడకు వచ్చిన హోంమంత్రి 10 లక్షల చెక్ ఇవ్వడంతో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 10 లక్షల చెక్ తో చేతులు దులుపుకుందాం అని అనుకుంటున్నారా అంటూ ఆందోళన చేసారు. nara lokesh హాస్పటల్ కి వస్తున్నారని తెలియడంతో మృతదేహాన్ని అక్కడినుంచి తీసుకువెల్లిపోయారు. ఈ విషయం నారా లోకేష్ కి తెలియడంతో బాదితుల ఇంటికి వెళ్లి వారిని ఓదార్చారు.

టీడీపీ నాయకులు కార్యకర్తలు ఉన్న ప్రాంతానికి వైసీపీ నేతలు అక్కడికి రావడంతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనదడంతో ఆ ప్రాంతానికి భారీగా పోలీసులు చేరుకున్నారు. అయితే టీడీపీ కార్యకర్తలు, పోలీసుల మద్య తోపులాట జరగడంతో నారా లోకేష్, ప్రత్తిపాటి పుల్లారావ్, నక్కా ఆనంద్ బాబు లను అరెస్టు చేసిన పోలీసులు కొందరు టిడిపి నాయకులను ఇష్టం వచ్చినట్లు ఈడ్చుకు పోయారు. మీడియా కెమెరాలను సైతం కింద పడేసి టీడీపీ నేత నక్కా ఆనంద బాబు పై చేయి కూడా చేసుకున్నారు. పోలీసుల తీరుపై టీడీపీ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన వ్యక్తం చేసారు.

Read more..

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular