బుధవారం, జూలై 17, 2024
Homeరాజకీయంచంద్రబాబు NSG బ్లాక్ క్యాట్ కమేండోస్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన స్పీకర్ తమ్మినేని

చంద్రబాబు NSG బ్లాక్ క్యాట్ కమేండోస్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన స్పీకర్ తమ్మినేని

టీడీపీ పై వైసీపీ నేతల మాటల యుద్ధం కొనసాగుతుంది. నిన్న మీడియా సమావేశంలో చంద్రభాబు ను ఉద్దేశించి కొడాలి నాని పరుష పదజాలంతో మాటల దాడికి దిగగా నేడు స్పీకర్ తమ్మినేని మరింత వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. తమ్మినేని చేసిన వ్యాఖ్యలు ఏకంగా చంద్రబాబుతో పాటు ఆయన సెక్యురుటీ గా ఉంటున్న బ్లాక్ క్యాట్ కమెండోస్ పై చెయ్యడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.

తాజాగా జరిగిన మీడియా సమావేశంలో స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ చంద్రబాబు అధికారం లేకపోవడంతో విలవిలా కొట్టుకుంటున్నాడంటూ..దేశంలో ఎంతోమందికి ప్రాణహాని ఉన్నాయని అయితే చంద్రబాబు మాత్రం వ్యవస్థకు ఏమైనా అతీతుడా అంటూ దేశ వ్యాప్తంగా ప్రాణహాని ఉన్నవాల్లందరికీ జడ్ ప్లస్ సేక్యురుటీ ఏమైనా ఇస్తున్నారా అంటూ జడ్ ప్లస్ సేక్యురుటీ కి బాబు అనర్హుడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు.

చంద్రబాబు వెనక ఉండే బ్లాక్ క్యాట్ కమేన్డోస్ ను తీసివేస్తే చంద్రబాబు ఫినీష్ అంటూ వాళ్ళ దైర్యంతోనే చంద్రబాబు మాట్లాడుతున్నారని.. బ్లాక్ క్యాట్ కమేన్డోస్ ను ఉపసంహరించాలని కేంద్రాన్ని స్పీకర్ స్థానంలో ఉండి నేను కోరుతున్నానని వివాదాస్పద వ్యాఖ్యలుచెయ్యడంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహిస్తున్న చంద్రబాబు భద్రతపై పలు అనుమానాలకు తావిస్తున్నాయి. తమ్మినేని వ్యాఖ్యలపై N.S.G మరియు కేంద్రం ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular