ఆదివారం, మే 26, 2024
Homeభక్తిSVBC లోని ఉద్యోగుల అశ్లీల వీడియోల బాగోతం

SVBC లోని ఉద్యోగుల అశ్లీల వీడియోల బాగోతం

వెంకటేశ్వరస్వామి  భక్తుల కోసం స్థాపించిన SVBC  ప్రతిష్టకు  నేడు కళంకం ఏర్పడే పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకూ భక్తి ప్రవచనాలు, స్వామివారి సేవ,  ఉత్సవాలు మొదలైన కార్యక్రమాలు SVBC లో ఇప్పటివరకూ భక్తుల ముందుకు తీసుకువస్తూ స్వామి  వారి విశిష్టతను పెంచాల్సిన అధికారులు ప్రపంచ వ్యాప్తంగా TTD కి ఉన్న ప్రతిష్ఠతను నాశనం చేస్తున్నారు.

తాజాగా  ఎస్వీబీసీ లో కొత్తగా ఉద్యోగంలోకి వచ్చిన ఒక ఉద్యోగి ఒక మహిళకు మొబైల్ లో అశ్లీల వీడియోల లింక్ పంపించడంతో ఇప్పుడు ఈ ఘటన పెద్ద దుమారం రేపింది. సదరు మహిళ తన మొబైల్ కి వచ్చిన లింక్ అశ్లీల  వీడియోగా గుర్తించిన మహిళ మొత్తం ఆధారాలతో సహా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వగా విషయం బయటకు రావడంతో ఎస్వీబీసీ అధికారులు ఈ ఘటనపై సైబర్ క్రైమ్,  విజిలెన్స్ అధికారులు ఎస్వీబీసీ ఆఫీసులో  సోదాలకు ఆదేశించారు. దీనితో అధికారులు సదరు వ్యక్తి యొక్క అస్లీల వీడియోల లింక్ మరియు ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు.

సైబర్ క్రైమ్ అధికారులు మరికొంత మంది ఫోన్ లు కంప్యూటర్ లు తనికీలు చెయ్యగా ఇంకో ముగ్గురు ఉద్యోగుల  కంప్యూటర్లో  అస్లీల వీడియోలు ఆఫీసులోనే చూస్తున్నట్లు గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు ఉదోగిని వెంటనే తొలగించాలని ఆదేశించారు. మిగతా ముగ్గురిపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అయితే వీరే కాక ఆఫీసులో మరికొంత మంది ఇలాగే చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే SVBC లో కమేడియన్ పృథ్వి రాజ్ చేసిన పనికి తలదించుకుంటున్న తరుణంలో వెంకటేశ్వర స్వామీ సన్నిధిలో ఇలాంటి పనుల వల్ల భక్తులను అసహనానికి గురిచేస్తున్నాయి.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular