గురువారం, ఫిబ్రవరి 29, 2024
Homeసినిమాసుశాంత్ కేసులో రియా రియాక్షన్ ...

సుశాంత్ కేసులో రియా రియాక్షన్ …

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వెనుక మిస్టరీ రోజురోజుకూ ఉత్కంటంగా మారుతూనే ఉంది. తాజాగా సుశాంత్​  ప్రియురాలు అతని మృతి కేసులో తనపై  తప్పుడు ఆరోపణలు చేస్తూ చాలా మంది అసత్య సమాచారం ఇచ్చారని అలాంటివాళ్లను వదలొద్దని అలాంటి వారిపై చట్టరీత్య తగు చర్యలు తీసుకోవలసిందిగా  రియా చక్రవర్తి సీబీఐ కు లేఖ రాసారు. ఈ కేసును డింపుల్​ తవానీ అనే  మహిళ ఈ కేసుని వ్యూహాత్మకంగా పక్కదారి పట్టిస్తున్నారని రియా తన లేఖలో పేర్కొన్నారు.

తవానీ ఈ కేసుని పక్కదోవ పట్టించడానికి లేక కూడా రాసారని తెలిపారు. సుశాంత్‌ ఆత్మహత్యకి ముందు రోజే అంటే జూన్‌ 13న రియాను తన నివాసం వద్ద సుశాంత్‌ వదిలి వెళ్లినట్టు డింపుల్‌ ఓ టీవీ ఇంటర్వ్యూలో పేర్కోన్నారు. ఇలా ఆమె చేస్తున్న ఆరోపణలను తోసిపుచ్చారు రియా. 

డింపుల్ దర్యాప్తు అధికారుల్ని పూర్తిగా పక్కదారి పట్టించేలా చేస్తున్నారని తప్పుడు సమాచారం  ఇచ్చిన వ్యక్తుల చిట్టా తయారు చేస్తామని రియా చక్రవర్తి తరఫు న్యాయవాది తెలిపారు. ఇలాంటివాళ్ళందరి లిస్ట్   సీబీఐ  పంపించి వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరనున్నట్టు తెలిపారు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular