బుధవారం, జూలై 17, 2024
Homeరాజకీయంపతంజలి పై సుప్రీం కోర్టు ఆగ్రహం ఒక్కో ప్రొడుక్ట్ 1 కోటి జరిమానా..?

పతంజలి పై సుప్రీం కోర్టు ఆగ్రహం ఒక్కో ప్రొడుక్ట్ 1 కోటి జరిమానా..?

భారత దేశ ఆయుర్వేద ప్రోడక్ట్స్ పతంజలి కి నేడు సుప్రీం కోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. పతంజలి ప్రోడక్ట్స్ కంపెనీ మొదట హరిద్వార్ లో స్థాపించి అంచలంచెలుగా దానిని మరో 15దేశాలకు విస్తరించింది. అంతేకాక బ్రాండ్ మార్కెట్ వేల్యూ సైతం అలాగే సంపాదించింది.

ఏదైనా ప్రోడక్ట్ లాంచ్ చేసిన తరువాత అది సక్సెస్ ఫుల్ గా జనాల్లోకి వెళ్లాలంటే ఒక నమ్మకమైన వ్యక్తి ఆ ప్రోడక్ట్ కి అంబాసిడర్ గా ఉండాలి. అందుకే Patanjali ని వేగంగా ప్రజల్లోకి వెళ్ళడానికి యోగా బాబా రాందేవ్ ని పతంజలి ప్రోడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా రావడంతో పతంజలి మార్కెట్ మరింత పెరిగింది.

అయితే పంతంజలి ప్రమోషన్ లో భాగంగా బాబా రాందేవ్ పలుమార్లు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఆయన్ని చిక్కుల్లో పడేశాయి. జూలై 2022 లో అల్లోపతి, పార్మా కంపెనీలు, మెడికల్ ఇండస్ట్రీల నుండి దేశాన్ని మరియు మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటూ సందేశం ఇచ్చారు.

patanjali
                                                                  Patanjali

అంతేకాక కరోనా సమయంలో అల్లోపతీ వాడుతూ ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. అంతేకాక కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకుని ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని అనడమే కాకుండా కోవిడ్ సమయంలో హాస్పటల్స్ లో ఇచ్చే ఆక్సిజన్ సిలిండర్లపై పలు వ్యాఖ్యలు చేశారు దీనితో 2022 జూన్ న పతంజలి ప్రొడక్ట్స్ , బాబా రాందేవ్ పై ఇండియన్ మెడికల్ కౌన్సిల్ కోర్టులలో కేసు ఫైల్ చెయ్యడంతో కోర్టు విచారణకు తీసుకోవడంతో నేడు సుప్రీం కోర్టు పతంజలిపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

ఇకపై “తప్పుదోవ”, “భ్రమ” కలిగించే అసత్య ప్రచారం చేసే ప్రకటనలు వెంటనే తొలగించాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది.
అంతేకాక ఇకపై ఏదైనా వ్యాధిని తమ ప్రోడక్ట్ ద్వారా నిర్మూలిస్తామని అబద్దపు ప్రకటనలు ఇస్తే ఇకపై ఒక్కో ప్రకటనకు రూ.1 కోటి జరిమానా విధిస్తామని కోర్టు హెచ్చరించింది.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular