గోవధ పై నిషేధం విధించిన శ్రీలంక ప్రభుత్వం …!

0
231
sri lanka government new desission on cow
sri lanka government new desission on cows

శ్రీలంక ప్రభుత్వం త్వరలో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతుంది అదే గోవధ నియంత్రణ చట్టం. దీనితో పూర్తి స్థాయిలో శ్రీలంక లోని గోవులపై జరుగుతున్న హింసాఖాండను పూర్తిగా బ్యాన్ చేసే దిశగా శ్రీలంక ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇప్పటికే శ్రీలంకలో గోవధ చట్టం ఉన్నా దానిలోని కొన్ని లొసుగులను ఉపయోగించుకుని చాలా మంది గోమాతను కభేళాలకు తరలిస్తున్నారు.

దీనితో అక్కడి హిందూ ధార్మిక సంస్థలు ప్రభుత్వానికి అనేక సార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. అయితే 2009 లో శ్రీలంక పార్లమెంట్ లో గోవధ నిషేధంపై బిల్లును ప్రవేసపెట్టినా దానిని కొంతమంది నాయకులు సపోర్ట్ చేయకపోవడంతో ఆ బిల్ పాస్ కాలేదు.

అయితే మొన్నజరిగిన ఎన్నికలలో హిందూ మరియు బౌద్ధులు ఈ విషయాన్ని తీవ్రతరం చెయ్యగా ఆ ఎన్నికల్లో గోవధ నిషేధం ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే శ్రీలంకలో సుమారు 25.5 లక్షల మంది హిందువులు ఉన్నారు. ఇక భారత్ నుండి కొన్ని వందల సంవత్సరాల క్రితమే శ్రీలంక లో బౌద్ధులు 22వేల మంది వరకూ ఆక్కడ నివసిస్తున్నారు.

అయితే ఎన్నికలలో శ్రీలంక ప్రధానిగా పోటీ చేస్తున్న తరుణంలో మంహేంద్ర రాజపక్స తాము నెగ్గిన తరువాత గోవధను నిర్మూలిస్తామని తెలిపిన ఆయన ఆ దిశగా నేడు అడుగులు వేస్తుండడంతో ఇప్పుడు ఈ విషయం ఇంటర్నేషనల్ మీడియా లో సైతం చర్చనీయాంశంగా మారింది.