టాలివుడ్ నటి శ్రీలక్ష్మి కనకాల ఇకలేరు ! గత రెండేళ్ళు గా ఆమె బ్రెస్ట్ క్యాన్సర్ తో పోరాడుతూ ఈ రోజు కాసేపటి క్రితం ఆమె హైటెక్ సిటీ లో తన ఇంట్లో కన్నుమూశారు. ఇంతకుమునుపు ఈమె ఆయుర్వేద వైద్య నిపుణురాలు కూడా! కొన్నాళ్లుగా టీవీ సీరియల్స్ లో కూడా నటిస్తూ తన తల్లి దండ్రులకు తగ్గ తనయ గా మంచి గుర్తింపు పొందారు. నటుడు రాజీవ్ కనకాల చెల్లెలు శ్రీలక్ష్మి ఈమె వయసు 40, ఈమెకు ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు.
లక్ష్మికనకాల మద్రాస్ విశ్వ విద్యాలయంలో ఎం.ఏ పూర్తి చేసారు. చిన్నప్పటి నుండీ ఈమెకు డాక్టర్ ఉద్యోగం పై ఎంతగానో ఆసక్తి. లక్ష్మికనకాల భర్త సీనియర్ జర్నలిస్ట్ గా పనిచేసారు చిన్న వయసులోనే కాన్సర్ మహమ్మారి తో పోరాడి జయించినా అది పూర్తిగా నయం తగ్గకపోవడంతో నేడు కన్నుమూసారు శ్రీలక్ష్మి