మంగళవారం, జూన్ 18, 2024
HomeసినిమాSR Kalyana Mandapam Review | ఎస్.ఆర్. కళ్యాణ మండపం మూవీ రివ్యూ

SR Kalyana Mandapam Review | ఎస్.ఆర్. కళ్యాణ మండపం మూవీ రివ్యూ

SR Kalyana Mandapam Review: రాజావారు రాణిగారు సినిమాతో టాలివుడ్ లో ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ తో పాటు అందరి మన్ననలూ పొందాడు కిరణ్ అబ్బవరం ప్రస్తుతం తాను నటించిన మరో సినిమా ఎస్.ఆర్.కళ్యాణమండపం నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియంక జవాల్కర్ నటించగా గాదే శ్రీదర్ దర్శకుడిగా టాలివుడ్ కి పరిచయమవుతుండగా భరద్వాజ్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చారు.

కథ:

ఇక కధలోకి వెళితే కళ్యాణ్ (కిరణ్ అబ్బవరం) ఇంజినీరింగ్  చదువుతుంటాడు తండ్రి ధర్మ (సాయికుమార్) కి కళ్యాణ్ కి అస్సలు ఒకరంటే ఇంకొకరికి పడదు పూర్వం వీరి కుటుంబానికి ఆస్తి ఉండగా ఆ ఆస్తి అంతటినీ కళ్యాణ్ తండ్రి ఒక కళ్యాణమండపం ద్వారా బిజినెస్ మెదలు పెట్టగా దానిలో నష్టాలు వచ్చి తన మొత్తం ఆస్తి కోల్పోవాల్సి వస్తుంది.

అంతే కాక కళ్యాణమండపం కూడా తాకట్టు పెడతాడు. ఇక సిటీలో చదువుకొంటూ ఉంటున్న కళ్యాణ్ తన వూరి ఆమ్మాయి అయిన సింధు (ప్రియాంక జవాల్కర్) ను ప్రేమిస్తాడు. అయితే తండ్రి కళ్యాణ మండపాన్ని తాకట్టు పెట్టినట్లు తెలుసుకున్న కళ్యాణ్ చదువు ఆపేసి తన స్నేహితులతో పాటు వూరికి వచ్చి కల్యాణ మండపం బిజినెస్ మొదలు పెడతాడు. అయితే ప్రేమించిన అమ్మాయిని వదిలేసి వూరికి వచ్చిన కళ్యాణ్ లవ్ సక్సెస్ అయ్యిందా? తన తండ్రి తాకట్టు పెట్టిన కళ్యాణ మండపాన్ని తిరిగి సొంతం చేసుకున్నాడా అనేది సెకండ్ ఆఫ్ లో తెలుస్తుంది.

నటీ నటుల పని తీరు

మొదటి సినిమాతోనే ఒక మంచి నటుడిగా తనకంటూ ఒక మార్క్ ఏర్పరుచుకున్న కిరణ్ అబ్బవరం రెండో సినిమాలోనూ మరింత పరిణితి చెందిన నటుడిగా తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. కిరణ్ ఎంచుకున్న రెండు సినిమాలూ మూస పద్దతిలో కాకుండా రెండు సినిమాలూ సెపరేట్ జోనర్లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

ఇక హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ తన పాత్రకు తగ్గట్టు బాగానే మెప్పించింది. ఇక ఈ సినిమాలో కథ తో పాటు సినిమాకు కావాల్సిన ఎంటర్తైన్మెంట్ తోపాటు నటించిన ప్రతీ కేరెక్టర్ కూ డైరెక్టర్ న్యాయం చేసాడనే చెప్పాలి ప్రధానంగా తండ్రి క్యారెక్టర్లో సాయికుమార్ చాలా రోజులతరువాత ఎమోషనల్ క్యారెక్టర్లో తనకు ఇచ్చిన క్యారెక్టర్ కు తగ్గట్టు నటించారు. ఇక ప్రధానంగా ఈ సినిమా నిడివి రెండు గంటల 48నిమిషాలు ఉన్న ఈ సినిమాకి కత్తెర వెయ్యాల్సిన షాట్ లు చాలానే ఉన్నాయి. సెకండ్ హాఫ్ కూడా చాలా వరకూ లాగ్ అనిపించింది. హీరో వూహ తెలిసినప్పటినుండి తండ్రి కొడుకులు మాలాడుకోరు అలాంటి సమయంలో వాల్లిదరూ ఎందుకు మాట్లాడుకోవట్లేదో అనే విషయం ప్రేక్షకుడికి చెప్పే తీరు చాలా ఫన్నీగా ఉంటుంది. ఇక ఈ సినిమాకి సంగీతం ఇచ్చియన్ భరద్వాజ్ మంచి బ్యాగ్రౌండ్ తోపాటు మంఛి మ్యూజిక్ అందించారు.

చివరిగా పెద్దగా హోప్స్ పెట్టుకోకుండా ఒక సారి చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు

రేటింగ్: 2.5 / 5

ప్లస్ పాయింట్స్

నటీనటుల నటన

సంగీతం

సినీమాటోగ్రఫీ

మైనెస్ పాయింట్స్

రొటీన్ కథ

సెకండ్ ఆఫ్ లేగ్ సీన్స్

ఇవికూడా చదవండి: నిహారిక భర్త చైతన్యపై న్యూసెన్స్ చేసాడంటూ పిర్యాదు

అదరగొడుతున్న Ola Electric Scooter 24 గంటల్లో లక్ష ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ల బుకింగ్

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular