బుధవారం, జూలై 17, 2024
Homeక్రీడలుటీమ్ ఇండియా ప్లేయర్ సీక్రెట్ బయటపెట్టిన శ్రేయస్ అయ్యర్

టీమ్ ఇండియా ప్లేయర్ సీక్రెట్ బయటపెట్టిన శ్రేయస్ అయ్యర్

2023 క్రికెట్  ప్రపంచ వరల్డ్ కప్ లో వరుస విజయాలతో 10 మ్యాచ్లలో గెలుపొంది ఫైనెల్ కు చేరిన భారత్ టీమ్ ఫుల్ జోష్ లో ఉన్న తరుణంలో మొన్న ఇండియా –న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో భారత్ గెలుపొందిన తరువాత మీడియాతో మాట్లాడిన టీమ్ ఇండియా ప్లేయర్స్ పలు ఆసక్తికర కామెంట్స్ చేసారు.

టీమ్ ఇండియా ప్లేయర్స్ పై ఆసక్తికర కామెంట్స్ చేసిన వారిలో రోహిత్ శర్మ కూడా ఉండడం విశేషం. మ్యాచ్ అనంతరం ఒక జర్నలిస్ట్ రోహిత్ శర్మను మొన్న మీ డ్రెస్సింగ్ రూమ్ లో ఒక “ర్యాంప్ వాక్” ఫ్యాషన్ షో ఈవెంట్ నిర్వహించారని తెలిసింది ఆ ర్యాంప్ వాక్ లో ఫైనల్ విన్నర్ గా ఎవరు గెలిచారని అడగగా నేను చేప్పనని రోహిత్ మాట దాటవేశాడు. ఆ జర్నలిస్ట్ శ్రేయస్ అయ్యర్ విన్నర్ అయ్యుంటాడని అనగా రోహిత్ నవ్వుతూ ఉండిపోయాడు.

తరువాత ఆ జర్నలిస్ట్ శ్రేయస్ అయ్యర్ వద్దకు వెళ్లి మొన్న జరిగిన ఫ్యాషన్ షో “ర్యాంప్ వాక్” లో మీరు గెలిచారా అని అడగగా అయ్యర్ బదులిస్తూ నేను కాదు అది గెలిచింది శార్దూల్ ఠాకూర్ అని బదులివ్వగా అక్కడి జర్నలిస్ట్ అవాక్కయ్యాడు. సాధారణంగా ఇండియా మ్యాచ్ జరిగినప్పుడు ఫలితాలు ఎలాఉన్నా క్రికెటర్స్ డ్రెస్సింగ్ రూమ్ లో ఎప్పుడూ ఆ జోష్ మాత్రం మామూలుగా ఉండదు. ఇక ఎవరిదైనా బర్త్డే వచ్చిందంటే ఆ సెలబ్రేషన్స్ మామూలుగా ఉండవు. సీనియర్ ప్లేయర్స్ శ్రేయస్ అయ్యర్ మరియు శార్దూల్ ఠాకూర్ ను ఆటపట్టిస్తుంటారు.          

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular