ఆదివారం, మే 26, 2024
HomeరాజకీయంYS Sharmila: డిల్లీకి షర్మిల..ఎల్లుండే వై.ఎస్.ఆర్.టీ.పీ కాంగ్రెస్ లో విలీనం

YS Sharmila: డిల్లీకి షర్మిల..ఎల్లుండే వై.ఎస్.ఆర్.టీ.పీ కాంగ్రెస్ లో విలీనం

YS Sharmila: తెలంగాణాలో వై.ఎస్ షర్మిల స్థాపించిన వై.ఎస్,ఆర్.టీ.పీ కథ నేటితో ముగిసినట్లే ఇప్పటికే ఎలక్షన్ ముందు పలు రాజకీయ కారణాలతో వై.ఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరకపోయినా డిల్లీలో రాహుల్ సమక్షంలో పలు హామీలు పొందిన విషయం తెలిసిందే.

అయితే ఎలక్షన్ తరువాత ఎలాగూ తెలంగాణలో కాంగ్రెస్ అధికార పీఠిము ఎక్కిన తరువాత రాహుల్ సమక్షంలో ఏపీ లో కూడా కాంగ్రెస్ ను మళ్లీ గాడిన పెట్టె ఉద్దేశంతోనే డిల్లీ అధిష్టానం YS Sharmila కు ఏపీ లో కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తారనే వార్త ఒకటి బయటికి వచ్చింది.

అయితే తాజాగా కొద్దిసేపటి క్రితం మీడియా ముందుకు వచ్చిన వై.ఎస్ షర్మిల తన నిర్ణయాన్ని ప్రకటించారు. త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న తన కొడుకు వైఎస్ రాజా రెడ్డి మొదటి పెళ్లి ఇన్విటేషన్ ను రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద పెట్టామని అన్నారు. తెలంగాణా లో కాంగ్రెస్ పార్టీతో పనిచెయ్యాలని ఎలక్షన్ కి ముందే తాను నిర్ణయించుకున్నానని, అందుకే కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపానని అందుకే నేడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కేసీఆర్ ప్రజా వ్యతిరేకతతో ప్రజలు దించడంలో వై.ఎస్.ఆర్.టీ.పీ పెద్ద పాత్ర పోషించిందన్నారు.

సుమారు 31 నియోజక వర్గాల్లో కాంగ్రెస్ నాయకులు 10వేల మెజారిటీతో గెలుపొందారని వారు గెలవడానికి కారణం తాము పోతీచేయ్యకపోవడమే అని అన్నారు. మేము పోటీ చేసుంటే కాంగ్రెస్ కు చాలా ఇబ్బందులు తలేత్తేవని అది వారికి కూడా తెసుసని వారిలో కూడా ఆ కృతజ్ఞతా భావం ఉందని అన్నారు.

అందుకే నేను చేసిన త్యాగానికి విలువనిచ్చి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారని అన్నారు. తనకి కాంగ్రెస్ తో పనిచెయ్యడానికి ఎలాంటి అబ్యంతరం లేదని దేశంలోనే కాంగ్రెస్ అతి పెద్ద సెక్యులర్ పార్టీ అని అన్నారు. వీలైతే రేపే డిల్లీ కి బయలుదేరి వెతున్నానని అన్నారు.

దీనితో ఈనెల 4వ తారీకున కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు మల్లికార్జున ఖర్గే మరియు రాహుల్ సమక్షంలో పార్టీని విలీనం చేస్తున్నట్లు తెలుస్తోంది. విలీనం అనంతరం మీడియా సమావేశం పెట్టి డిల్లీ నుండి ఈ విషయాన్ని ప్రకటించనున్నారు షర్మిల.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular