శనివారం, జూలై 27, 2024
Homeభక్తితిరుమల దేవస్థానం భూములు అమ్మడం సరికాదు.

తిరుమల దేవస్థానం భూములు అమ్మడం సరికాదు.

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) భూముల విషయం ప్రస్తుతం వివాదాస్పదమైంది. దేవస్థానం అధీనంలో ఉన్న  భూములను విక్రయించాలనుకోవడం సరికాదని  ప్రభుత్వానికి దింట్లో హక్కు ఏంమిటని వాదనలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం భూములపై ప్రభుత్వ వైఖరి వాటిపై వ్యాపారం చేయడంలాంటిదే అని మండిపడుతున్నారు.

ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్‌ చేశారు. ఇది మంచిది కాదని ఒకసారి ఇలా ఆస్తుల విక్రయాలు ప్రారంభిస్తే అది అక్కడితో ఆగదని అమ్మకాలు ఇకపై కూడా యదేచ్చగా జరుపుతూనే ఉంటాయని  పేర్కొన్నారు. అయినా ఎవరో దాతలు ఇచ్చిన  దేవస్థానం భూములను విక్రయించి సేవా కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం లేదని. భక్తులు అందజేసిన విరాళాలతో కార్యక్రమాలు చేయాలని సూచించారు.

దేవస్థానానికి ఆస్తులను భక్తులు భక్తితో ఇస్తారని ఆ భూములు ఇచ్చింది విక్రయించడం కోసం కాదని  ఈ విషయాన్ని తిలుమల తిరుపతి దేవస్థానం గుర్తించాలన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు. భక్తులు దేవుడికై ముడుపులు, ఇతరులు వేరువేరు రూపాల్లో విరాళాలు ఆ  వెంకటేశ్వరస్వామికి కానుకలుగా అందిస్తారు. ఈ ఆదాయంతో విద్య, వైద్యం వంటి పౌరసేవలను చాలా కాలం నుంచే దేవస్థానం నిర్వహిస్తోందన్నారు. ఇప్పుడు ఆ భూములను అమ్మడం సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు తెలిపారు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular