శనివారం, జూలై 27, 2024
Homeజాతీయంక్యారెట్ పండించిన రైతులను ఆదుకోండి..! బీజేపీ నేత ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి

క్యారెట్ పండించిన రైతులను ఆదుకోండి..! బీజేపీ నేత ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి

అనంతపురం జిల్లా : బీజేపీ రాష్ట్రాఉపాధ్యక్షులు ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి అనంతపురం జిల్లాలోని కదిరి అసెంబ్లీ పరిధిలో గల తనకల్లు మండలంలో నేడు  క్యారెట్ పంటలు వేసి నష్టపోయిన పలువురి రైతులను నేడు కలవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మరియు అధికారులు ప్రతీ రోజు రైతులను ఎలాగైనా అదుకుంటున్నామని చెబుతున్నారు. ఎవరైతే రైతులు నష్ట పోతున్నారో వారిని గుర్తించి పంట నష్టపరిహారం ఎకరాకు కనీసం 25 వేలరూపాయలు వారికి ఇవ్వాలని బిజేపి పార్టీ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తుందన్నారు.

సుమారు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు పాటలపై పెట్టుబడులు పెట్టి 250 ఎకరాల్లో 200 మంది రైతులు ఈ ఒక్క మండలంలో ఈ పంట సాగు చేయడం జరిగింది. అయితే  జిల్లా వ్యాప్తంగా ఇంత సాగు ఉన్న రైతులు ఇబ్బందులు పడుతున్నా కర్నాటక రాష్ట్రం నుండి  వ్యాపారస్థులు దిగుమతి చేసుకోవడం మన  అదికారులు ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడం నిజంగా మన దురద్రుష్టకరం.

ప్రస్తుతం ఈ అంశంపై జిల్లా అధికారులు మరియు జిల్లా కలెక్టర్ అక్కడ నుండి మాట్లాడడం జరిగింది. అనంతరం కలెక్టర్ తో మరియు రైతులతో సాలిసి మాట్లాడి వారి సమస్య పరిష్కారానికి సహకరించాలని విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో బాజాపా నాయకులు మరియు హిందూపురం పార్లమెంట్ అధ్యక్షులు వజ్ర భాస్కర్ రెడ్డి గారు అంతేకాక రాష్ట్ర నాయకులు రొద్దం ఉత్తం రెడ్డి , గంగాధర్ గారు మొదలగు నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular