సర్కారు వారి పాట రివ్యూ | Sarkaru Vaari Pata Review

0
96
Sarkaru Vaari Paata Review
Sarkaru Vaari Paata Review

Sarkaru Vaari Pata Review: సూపర్ స్టార్ మహేష్ బాబు (mahesh babu) హీరోగా కీర్తీ సురేష్ (keerthi suresh) హీరోయిన్ గా పరసురామ్ దర్శకత్వంలో తాజాగా విడుదలైన మోస్ట్ అవైటెడ్ మూవీ సర్కారు వారి పాట. ఇప్పటికే కరోనా దెబ్బకు పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా దాదాపు రెండేళ్ళ ఫ్యాన్స్ ఎదురుచూపుల తర్వాత చివరికి దియేటర్ కు వచ్చిన ఈ సినిమా ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం.

కథ

ఒక బ్యాంకులో మహేష్ (మహేష్ బాబు) తల్లితండ్రులు అప్పు తీసుకున్ ఆ అప్పుని చెల్లించలేక చనిపోతారు ఈ విషయం మహేష్ మనస్సులో బలంగా నాటుకుపోవడంతో అప్పటినుంచి అమెరికాలో అప్పు కావాలన్న వారికి అప్పు ఇస్తూ అక్కడే ఒక ఫైనాన్స్ కార్పోరేషన్ స్థాపిస్తాడు. ఇలా అప్పు ఇస్తూ ఎలాంటి వారినైనా వదలకుండా వడ్డీ వసూలు చేస్తుంటాడు మహేష్.

అలాంటి మహేష్ నే బురిడీ కొట్టిస్తుంది కళావతి (కీర్తి సురేష్). చదువు నిమిత్తం అమెరికాకు వెళ్ళిన కళావతి అక్కడ మద్యం వంటి వ్యసనాలకు బానిసై మహేష్ వద్ద నుండి అప్పు తీసుకుంటుంది. అప్పటికే కళావతి పై మనసు పారేసుకున్న మహేష్ తాను అడిగినంత డబ్బు ఇస్తాడు అయితే కొద్ది రోజులకు తీసుకున్న అప్పు తిరిగివ్వమని మహేష్ కలావతి ని అడగడంతో నేను తీర్చనని చెబుతుంది. దీనితో కళావతి తండ్రి రాజేంద్రనాథ్ (సముద్రఖని) నుండి అప్పు వసూలు చెయ్యడం కోసం విశాఖపట్నం వస్తాడు మహేష్. తీరా విశాఖపట్నం వచ్చిన మహేష్ రాజేంద్రనాథ్ తనకు పది వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని చెబుతాడు అసలు పదివేల కోట్లు రాజేంద్రనాథ్ మహేష్ కి ఎందుకివ్వాలి అసలు చివరికి పదివేల కోట్లు వసూలు చేసాడా అనేది Sarkaru Vaari Pata తెరపై చూడాల్సిందే.

నటీనటుల పనితీరు:

పైనాన్సియర్ కేరక్టర్ లో mahesh babu నటన అద్భుతంగా చేసారనే చెప్పాలి క్లాస్ సినిమా అయినా మాస్ సినిమా అయినా mahesh babuమార్క్ నటన ఎవరూ వేలెత్తని విదంగా ఉంటుందనేది తెలిసిందే అయితే ఈ సినిమా ద్వారా రొమాంటిక్ యాంగిల్ ని కూడా పరిచయం చేసారు డైరెక్టర్ పరశురామ్. ఒకవిదంగా చెప్పాలంటే మహేష్ వన్ మాన్ షో తో ఆరగోట్టాడనే చెప్పాలి. ఇక కామెడీ టైమింగ్ తో పాటు డాన్స్ లతో కూడా mahesh babu మెప్పించాడు.

ఇక హీరోయిన్ గా keerthi suresh ఇప్పటివరకూ చెయ్యని ఒక కొత్త కేరెక్టర్ లో అద్భుతంగా నటించింది. ప్రధమార్ధంలో వెన్నెల కిషోర్ తో సాగిన కామెడీ ట్రాక్ నవ్వులు పూయిస్తుంది. మహేష్ కి జోడీగా మెప్పించిన keerthi suresh అందంతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో వెన్నెల కిషోర్ కామీడీ బాగుంది దీనితోపాటు సముద్రఖని, తనికెళ్ళ భరణి, నదియా, సుబ్బరాజు, బ్రహ్మాజీ, పోసాని వంటి వారు తమ తమ కేరెక్టర్ లలో పర్వాలేదనిపించారు.  

విశ్లేషణ – Sarkaru Vaari Pata Review

ఒక విధంగా ఈ సినిమా ప్రేక్షకులనూ మరియూ mahesh babu ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేస్తూనే సినిమాలో ఒక చిన్న సందేశం ఇవ్వడానికే ఈ కథ రాసుకున్నట్లు తెలుస్తుంది. ప్రదానంగా డైరెక్టర్ ఒక కామన్ మాన్ తన నిజ జీవితంలో ఎదో ఒక సమయంలో అప్పు తీసకునే ఉంటాడు అలా అప్పు తీసుకునే వ్యక్తి యొక్క బిహేవియర్ ఎలా ఉంటుదనే విషయం ఈ కథ ద్వారా డైరెక్టర్ తెలిపిన విధానం బాగున్నా అది ఫ్యాన్స్ కోసమో లేక కమర్సియాలిటీ కోసమో తెలియదు కాని ఒక సీరియస్ కధకు కామెడీ జోడించి చెప్పే ప్రయత్నం మాత్రం కొంచెం చికాకుగా అనిపిస్తుంది.

అప్పుల గురించి చెబుతూ బ్యాంకుల నుండి కొన్ని వేల కోట్లు ఎగవేసి పారిపోయిన కొంతమందికి చురకలు అంటిచారు డైరెక్టర్ అయితే దీనిలో mahesh babu మాస్ సన్నివేశాలతో కథని కమర్షియల్ చేసేశాడు డైరెక్టర్. ఇక విలన్ గా నటించిన సముద్రఖని క్యారెక్టర్ స్టార్ట్ లో వీరలేవేల్ లో చూపించి చివరకు తూతూ మంత్రం గానే కానిచ్చేసాడు. ఫస్ట్ హాఫ్ మినహా మిగతా కథ అంతా ప్రేక్షకుడు ముందుగానే ఊహించేవిధంగా ఉంటుంది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పనితీరు విషయానికి వస్తే సాంగ్స్ లో మెప్పించగా బాక్గ్రౌండ్ మాత్రం పర్వాలేదనిపించాడు.  వినోదంతో సాగే ఫైట్స్ బాగున్నాయి.

చివరగా : లాజిక్కులు పక్కనపెట్టి sarkaru vaari paata movie ఒక్కసారి చూడొచ్చు

ప్లస్ పాయింట్స్ :

                   మహేష్, కీర్తి సురేష్ నటన

                   డైలాగ్స్

                   సంగీతం

                   సినిమాటోగ్రఫీ

                   ఎడిటింగ్

మైనెస్ పాయింట్స్ :

                       కధనం

                       విలన్ రోల్

                       లాజిక్ లేని సన్నివేశాలు

sarkaru vaari paata rating

రేటింగ్ : 3.5 / 5