బాలివుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ను కు సోషల్ మీడియాలో వేదికగా ఫ్యాన్స్ ఒక ఆట ఆడుకున్నారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో తన ఫోటోలు మరియు జిమ్ వర్కౌట్స్ వంటి ఫోటోలను సల్మాన్ ఖాన్ పోస్ట్ చేస్తుంటాడు. అయితే తాజాగా సల్మాన్ వ్యవసాయం చేస్తున్నట్లు కనిపించే ఫోటోలను పోస్ట్ చేసి ఆ ఫోటోకి క్యాప్సన్ గా “ప్రతీ బియ్యపు గింజ పై తినేవాడి పేరు ఉంటుంది అంటూ జై జవాన్ కై కిసాన్” అంటూ పోస్ట్ చేసాడు. దీనితో కొంత మంది ఫ్యాన్స్ సల్మాన్ పై ట్విట్టర్ లో విరుచుకుపడ్డారు.

ప్రపంచంలో నీలాగా వ్యవసాయం చేసే వ్యక్తిని నేను ఎక్కడా చూడలేదని ఒకరు అనగా ఇంకొకరు నేలపై ఉన్న మట్టిని చేతితో ఒళ్లంతా భాగా రాసుకున్నావ్ అంతేగా అంటూ అసలు ఆ పంటభూమిలో అరికాళ్ళ వరకూ లేని బురద నీకు మాత్రం మొఖానికి కూడా అంటుకునేలా నేలపై పడి దోల్లావా అంటూ విమర్సించారు. అంతే కాక సల్మాన్ నువ్వు సినిమాలో నటించు అంతే కాని రైతులని ఎగతాళి చెయ్యకంటూ కామెంట్లు చేసారు.
ఇక సల్మాన్ పై సుశాంత్ సింగ్ రాజ్ పుట్ ఫ్యాన్స్ అయితే ఒక రేంజ్లో ఆడుకున్నారు. నీ వోవరేక్షన్ స్క్రీన్ పై చేసుకో నీ నటన అందరికీ తెలుసు నువ్వు ఎలాంటి వాడివో అంటూ ట్విట్టర్ వేదికగా పలు ఫోటోలు పెట్టి రచ్చ రచ్చ చేసారు. సల్మాన్ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో తొడలపై మరియు చేతులపై మట్టి తో పాటు చేతి వెళ్ళు గుర్తులు ఉండడం విశేషం. సుశాంత్ మరణం తరువాత సల్మాన్ పేరు చెబితేనే సుశాంత్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున విరుచుకు పడుతున్నారు .