మంగళవారం, జూన్ 18, 2024
HomeసినిమాRRR ఔట్ పుట్ పై రాజమౌళి అసంతృప్తి | RRR Movie updates

RRR ఔట్ పుట్ పై రాజమౌళి అసంతృప్తి | RRR Movie updates

కరోనా ప్రభావంతో టాలివుడ్ లో పెద్ద సినిమాలు మొత్తం ఎక్క్కడికక్కడే ఆగిపోయాయి. రెండు నెలల తరువాత ఇప్పుడే టాలివుడ్ పరిశ్రమలో పనిచేస్తున్న చిన్న చిన్న ఆర్టిస్టుల పరిస్థితి మరీ దారుణంగా తయారవ్వడంతో టాలివుడ్ కి సంబందించిన సినీ పెద్దలు మళ్ళీ షూటింగ్స్ ప్రారంబించడం కోసం ముందుగా తెలంగాణా లో సీఎం కేసీఆర్ నుండి అనుమతులు తీసుకోగా ఏపీ లో జగన్ సైతం ఒకే చెప్పేయడంతో అంతా హ్యాపీ అనుకుని షూటింగ్స్ మొదలుపెట్టేసారు. దీనిలో బాగంగానే “RRR” సినిమా షూటింగ్ పరిమితి సంఖ్యలో ఆర్టిస్టులతో టెస్ట్ షూట్ మొదలు పెట్టారు.

అయితే భారీ సినిమా కావడంతో హాలివుడ్, భాలివుడ్ ఆర్టిస్టులు దీనిలో ఉండటం తో ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ తో వారంతా షూటింగ్  కి రాలేని పరిస్థితి. కొద్ది రోజుల క్రితం హీరొయిన్ ఆలియాభట్ ముంభై లో ఉండిపోవడంతో రాజమౌళి ఇక్కడి పరిస్థితులని వివరించి తాను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటానని చెప్పడంతో ఆలియా భట్ కొంచెం కరోనా ఎఫెక్ట్ తగ్గగానే షూటింగ్ కి జాయిన్ అవుతాననడంతో జక్కన్న పరిమితి సంఖ్య ఆర్టిస్టులతో టెస్ట్ షూట్ చేయడంతో ఔట్ సరిగారాలేదని రాజమౌళి అబిప్రాయ పడడంతో కరోనా ఎఫెక్ట్ కొంచే సర్దుమనిగేదాకా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి తరువాత తిరిగి మంచి ఔట్ పుట్ పొందాలని జక్కన్న అబిప్రాయపడుతున్నట్లు తెలుస్తుంది. ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ మరియు టీజర్ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వారికి జక్కన్న తీసుకున్న నిర్ణయంతో ఫ్యాన్స్ కి ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular