మంగళవారం, జూన్ 6, 2023
Homeక్రీడలుRishabh Pant Car Accident : రిశభ్ పంత్ కార్ యాక్సిడెంట్...తీవ్రగాయాలు

Rishabh Pant Car Accident : రిశభ్ పంత్ కార్ యాక్సిడెంట్…తీవ్రగాయాలు

Rishabh Pant Car Accident : టీమ్ ఇండియా యంగ్ క్రికెట్ ప్లేయర్ మరియు వికెట్ కీపర్ రిశభ్ పంత్ కార్ యాక్సిడెంట్ జరిగింది. రిశభ్ పంత్ డిల్లీ నుండి ఇంటికి తిరిగి వెళుతున్న క్రమంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. రూర్కీ నర్షన్ బోర్డర్ హమాక్ పూర్ వద్ద తన BMW కారు రోడ్డు డివైడర్ ను గుద్దడంతో కారు ముందుభాగం గుర్తుపట్టలేనంతగా తయారైంది. అయితే డివైడర్ ను గుద్దిన కొద్దిసేపటికే కారులో మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైపోయింది.

యాక్సిడెంట్ అయిన తరువాత కారునుండి బయటపడిన రిశభ్ పంత్ ను మొదటగా రూర్కీ లోని హాస్పటల్ కు తరలించగా తరువాత అక్కడినుంచి డెహ్రాడూన్ లోని హాస్పటల్ కు తరలించారు. అయితే ఈ యాక్సిడెంట్ లో పంత్ కు తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. అంతేకాక పంత్ తల, చాతీ, వీపు మరియు కాళ్ళకు గాయాలైనట్లు తెలుస్తోంది. అయితే పంత్ తీవ్ర గాయాల దృష్ట్యా డెహ్రాడూన్ నుండి డిల్లీ తీసుకువెళ్ళినట్లు తెలుస్తోంది. డిల్లీ లోని హాస్పటల్ లో పంత్ కు ప్లాస్టిక్ సర్జరీ చేస్తున్నారు డాక్టర్లు.

RELATED ARTICLES

Most Popular