ఆదివారం, మే 26, 2024
Homeసినిమాగ్లాస్‌లోని టీ ఓవ‌ర్.. దీనివెనుక అర్థం ఏంటో తెలుసా..?

గ్లాస్‌లోని టీ ఓవ‌ర్.. దీనివెనుక అర్థం ఏంటో తెలుసా..?

పవర్ స్టార్ సినిమా పై ఇప్పటికే చాలా వివాదాలు నడుస్తున్నాయి.. అదే డేరింగ్ అండ్ డ్యాషింగ్ రామ్ గోపాల్ వ‌ర్మ ప్ర‌క‌టించిన ‘ప‌వ‌ర్ స్టార్’ సినిమాలో నుంచి ఇప్పటికే పలు పోస్టర్లు బయటకి రాగా ఇప్పుడు  మ‌రో న్యూ పోస్ట‌ర్ లేటెస్ట్ గా  రిలీజ్ చేశారు. ప్రతీ సారీ ఎదో  ఒక వివాదంతో .. కాదుకాదు సంచలనంతో వార్త‌ల్లో ఉంటారు ఆర్జీవీ. ఈ మ‌ధ్య వర్మ మరీ ఎక్కువ‌ కాంట్ర‌వ‌ర్సీలను భుజాన్నేసుకుని  తిరుగుతున్నారు.

ఈ మ‌ధ్య వర్మ అస్సలు తీరిక లేకుండా సినిమాలు వెబ్ సిరీస్ లు తీస్తున్న వర్మ కొత్తగా అమృత‌-ప్ర‌ణ‌య్‌ల ల‌వ్ స్టోరీ ఆదారంగా ‘మ‌ర్డ‌ర్’ అనే సినిమా  తీస్తున్న విష‌యం మనకు తెలిసిందే దీనిపై అమృత ఈ సినిమాను తాను అంగీకరించబోనని కూడా ఘాటుగానే స్పందించింది. ఈ ఇష్యు వెంటనే  ఇటీవ‌లే ఆయ‌న ప్ర‌క‌టించిన ‘ప‌వ‌ర్ స్టార్’ అనే సినిమాను ఆర్‌జీవి వ‌ర‌ల్డ్ థియేట‌ర్‌ యాప్ లో  విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అంతే కాక ఈ సినిమాపై ఇప్పటినుండే కాంట్రవర్సీలు స్టార్ట్ చేసేసారు.

కొద్దిరోజులుగా ఆర్‌జీవి కొన్ని పోస్టర్స్ రిలీజ్ చేసి‌ వాటిపై పలు విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు ఆర్జీవీ. పోస్ట‌ర్‌లో ఎన్నిక‌ల త‌ర్వాత క‌థ అంటూ రాసి కూడా మెన్షన్ చేశారు. పోస్టర్‌లో ఉన్న న‌టుడు న‌ల్ల‌ని దుస్తులు ధ‌రించి ఉన్నాడు. అంతేకాకుండా పోస్ట‌ర్‌లో ఒక టీ గ్లాస్ పట్టుకుని కూడా ఉంది. మరోసారి ‘ప‌వ‌ర్ స్టార్ సినిమా’ నుంచి మ‌రో లేటెస్ట్  పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశాడు. ‘గ్లాస్‌లోని టీ ఓవ‌ర్’ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత క‌థ అని ఇండైరెక్ట్ గా పవన్ ను టార్గెట్ చేసినట్టే ఉంది అంతే కాక చేతితో ఖాళీ గ్లాస్ ప‌ట్టుకుని ఉన్న పోస్ట‌ర్‌ విడుద‌ల చేసిన ఆర్‌జీవి విచ్చలవిడిగా టీవీ మరియు సోషల్ మీడియాలలో ప్రమోషన్స్ చేసుకుంటున్నారు.

అయితే ఈ కథ ఎలాఉండబోతోందోనని అంతా ఎదురుచూస్తున్నారు. లాక్ డౌన్ కార‌ణంగా థియేట‌ర్స్ అన్ని బంద్ అయ్యాయి దీంతో వ‌ర్మ‌ ఆర్‌జీవి వ‌ర‌ల్డ్ థియేట‌ర్’ పేరుతో ఓ యాప్‌ను డెవ‌ల‌ప్ చేశారు. లాక్‌డౌన్‌లో తెర‌కెక్కించిన సినిమాల‌న్నింటినీ ఈ యాప్ లో  విడుద‌ల‌ చేస్తున్నారు ఆర్‌జీవి.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular