ఆదివారం, మే 26, 2024
HomeజాతీయంVishaka: విశాఖ లో ఫార్మ కంపెనీలో రియాక్టర్ పేలి భారీ అగ్ని ప్రమాదం

Vishaka: విశాఖ లో ఫార్మ కంపెనీలో రియాక్టర్ పేలి భారీ అగ్ని ప్రమాదం

Vishaka News: విశాక వాసుల పాలిట ఫార్మా కంపెనీలు యమ కింకరుల్లా తయారయ్యాయి. ఆదాయం విషయం పక్కన పెడితే అనేక మంది ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. గతంలో May-2020 లో జరిగిన భారీ ప్రాణ నష్టం మరువక ముందే నేడు అనకాపల్లి అచ్యుతాపురం వద్ద స్పెషల్ ఎకనామిక్ జోన్ లోని సాహితీ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్‌ లో ఫార్మా యూనిట్ ‌లో శుక్రవారం జరిగిన భారీ  పేలుడు మరియు అగ్నిప్రమాద ఘటనలో అక్కడ పనిచేస్తున్న ఏడుగురు కార్మికులు గాయపడ్డారు

అయితే గాయపడిన వారిలో శరీరం కాలి నలుగురు పరిస్థితి విషమంగా ఉంది అయితే అక్కడ మొత్తం 35 మంది ఉద్యోగులు పని చేస్తుండగా 28మంది భారీ శబ్దం ధాటికి బయపడి పరుగున బయటకు వచ్చేశారని  SP తెలిపారు.

అయితే ఈ ఘటన రియాక్టర్ పేలడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. భారీ శబ్దంతో మంటలు చెలరేగడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు బయంతో పరుగులు తీసారు స్థానికులు ఫోన్ చెయ్యడంతో మూడు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular