గురువారం, ఫిబ్రవరి 29, 2024
Homeసినిమాత్వరలో రవితేజ భారీ బడ్జెట్ సినిమా..

త్వరలో రవితేజ భారీ బడ్జెట్ సినిమా..

రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజ హీరోగా భారీ బడ్జెట్ సినిమా తెరకేక్కబోతున్నట్లు టాలివుడ్ వర్గాల నుండి వినిపిస్తోంది. తాజాగా 2019 లో వచ్చిన రాక్షసుడు వంటి త్రిల్లర్ మూవీతో సక్సెస్స్ అందుకున్న రమేష్ వర్మ తాజాగా రవితేజకు ఒక కధ వినిపించారు ఆ కధ  రవితేజకుభాగా నచ్చడంతో ఈ సినిమాకు ఒకే చెప్పినట్లు తెలుస్తోంది.

అయితే ఈ సినిమా బడ్జెట్ దాదాపు 40 కోట్ల రూపాయల వరకూ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా మల్టీ లాంగ్వేజ్ లో తెరకేక్కుతుందనే వార్త కూడా వినబడుతోంది. అయితే వరుస ప్లాప్ లలో ఉన్న రవితేజ ఈ సినిమా బడ్జెట్ ను అందుకోగాలడా అనెది వేచి చూడాలి ప్రస్తుతం రవితేజ మార్కెట్ ఒక్కసారిగా డల్ అయిపోయిన విషయం తెలిసిందే.

అయినా ఒకదాని వెనక ఒకటి లైన్ లో పెట్టేస్తున్నాడు. ప్రస్తుతం క్రాక్ సినిమా కరోనా వల్ల వచ్చిన బ్రేక్ తరువాత తిరిగి షూటింగ్ స్టార్ట్ చేయగా మారుతి డైరెక్షన్ లో మరో సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు సినిమాలలో ఏది మొదట పట్టలేక్కుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులపాటు వేచి చూడాలి. ప్రస్తుతం రవితేజ చేస్తున్న క్రాక్ సినిమా పైన మాస్ మహారాజ్ భవితవ్యం ఆధారపడి ఉంది.          

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular