మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన Anasuya

0
235
anasuya images
Anasuya

జబర్దస్త్ షోతో మంచి పేరు సంపాదించుకున్న  అనసూయ వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ఈ మధ్య కాలంలో వచ్చిన ‘రంగస్థలం’ సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరైన అనసూయ ప్రస్తుతం యాత్ర, కథనం వంటి సినిమాలలో నటిస్తుంది.

అయితే Anasuya తాజాగా నటిస్తున్న చిత్రం F2. వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టార్ చిత్రంలో స్పెషల్ సాంగ్ లో చిందులేయనుంది. ఈ సాంగ్ ఫోక్ సాంగ్ గా ఉండనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో తమన్నా, మేహ్రీన్ లు హీరొయిన్లుగా నటిస్తుండగా దీనికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు.anasuya got latest movie offer

కొన్నాళ్ళగా  మంచి హిట్ లేకపోవడంతో అనిల్ రావిపూడి ఈ సినిమాపైనే అన్ని ఆశలూపెట్టుకున్నారు. ఈ నెల 12 న విడుదలైన టీసర్ రెండు రోజుల్లోనే ఐదు మిలియన్లకు పైగా వ్యూస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా పక్కా కామెడీ మరియు ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మలచినట్లు తెలుస్తుంది.

టీజర్లో ఫన్నీ ఎక్స్ప్రెషన్స్ తో వెంకటేష్, వరుణ్ తేజ్ చెప్పే డైలాగ్స్ చాలా రోజుల నుండి టాలివుడ్ లో మంచి కామెడీ మూవీ లేకపోవడంతో కామెడీ ప్రియులకు ఇది ఒక మంచి సినిమాగా నిలవనుంది.

దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.