మంగళవారం, జూన్ 25, 2024
HomeసినిమాRamaraju For Bheem Teaser Review….. టాలివుడ్ రికార్డుల వూచకోతే

Ramaraju For Bheem Teaser Review….. టాలివుడ్ రికార్డుల వూచకోతే

Ramaraju For Bheem Teaser Review : చాలా కాలం తర్వాత రాజమౌళి RRR నుండి ఎన్టీఆర్ టీజర్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషీ చేసాడు. ఇప్పటికే రామరాజు కి వెల్కమ్ చెబుతూ అద్భుతమైన వాయిస్ ఓవర్ తో అందరినీ ఆకట్టుకున్న ఎన్టీఆర్.

నేడు కొమరంభీమ్ పాత్రను పరిచయం చేస్తూ రాజమౌళి తీసుకొచ్చిన టీజట్ విశేషంగా ఆకట్టుకుంది. ప్రధానంగా రాజమౌళి అద్భుతమైన  పిక్చరైజేషన్ తో ఆకట్టుకోగా అంతకు మించి అద్భుతమైన నటనతో ఎన్టీఆర్ కొత్తలుక్ మరియు చురకత్తుల్లాంటి ఎక్స్ ప్రెషన్స్ తో అదరగొట్టాడు.

ఇక ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ కి తగ్గట్టుగా రామ్ చరణ్ వాయిస్ ఓవర్ డైలాగులు అద్భుతంగా ఆకట్టుకున్నాయి. వీటికి బలం చేకూరేటట్టు కీరవాణి మ్యూజిక్ తో మరోస్థాయికి తీసుకువెళ్లారు. ఎన్టీఆర్ టీజర్ లో ప్రధానంగా కొన్ని సీన్లలో చిరుత పులి ఘాట్లు ఎన్టీఆర్ పై గమనిస్తే అది చిరుతపులితో ఎన్టీఆర్ చేసిన ఫైట్ లాగ కనిపిస్తుంది.

ప్రస్తుతం ఈ టీజర్ అతి తక్కువ సమయంలో ఎక్కువ లైక్స్ వచ్చిన టీజర్ గా నిలిచింది. ఇప్పటికే టీజర్ సోషల్ మీడియాలో సునామీ సృష్టిస్తుండగా ఇక సినిమా రిలీజ్ అయితే ఎన్టీఆర్,  రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎలాంటి రచ్చ చేస్తారో చూడాలి. ప్రస్తుతం ట్రైలెర్ కే ఈ విధమైన రెస్పాన్స్ తో టాలివుడ్ లో ఉన్న మొత్తం రికార్డుల వూచకోతకి ఇక ఎంతో కాలం లేదనే చెప్పాలి.

Read Also.. మరోసారి దుమ్మురేపభోతున్న మీర్జాపూర్, ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లు

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular