దుమారం రేపుతున్న Ram Gopal Varma కమ్మ రాజ్యంలో కడప రెడ్లు

0
127
ram gopal varma kamma rajyam lo kadapa reddlu
ram gopal varma kamma rajyam lo kadapa reddlu

టాలివుడ్ లో సంచలనాత్మక దర్శకుడు కాంట్రవర్సీ లకు, వివాదాలకు తనే కేంద్రబిందువు అదే  Ram Gopal Varma ఇతను తీసే ప్రతీ సినిమాలో ఏదో ఒక కాంట్రవర్సీ సృష్టించే వర్మ గత కొన్ని రోజుల క్రితం లక్ష్మీస్ ఎన్టీఆర్ తో పెను దుమారం రేపిన విషయం తెలిసిందే.

తాజాగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాతో ఇంకొక వివాదాన్ని రాజేసాడు. తాజాగా రిలీజ్ చేసిన టీజర్ రాజకీయంగాను మరియు కొన్ని వర్గాల పార్టీ నేతలలో ఆందోళన  కలిగేలా చేసింది. వీరిలో టీడీపీ అదినేత చంద్రబాబు నాయుడు, లోకేష్, జగన్, పవన్ కళ్యాణ్ వంటి వారిని ఈ ట్రైలెర్ లో ఎవ్వరినీ వదిలిపెట్టలేదు.

ఈ ట్రైలెర్ లో ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ డైనింగ్ టేబుల్ వద్ద వచ్చే  సీన్ పై టీడీపీ నేతలు కొంచే గుర్రుగా ఉన్నారు. అయితే ఈ ట్రైలెర్ లో పవన్ కళ్యాణ్ పార్టీని కూడా విమర్శించనప్పటికీ తాజాగా Ram Gopal Varma రిలీజ్ చేసిన పోస్టర్ లో ఫారిన్ అమ్మాయిల మధ్య పవన్ కళ్యాణ్ స్పీచ్ ఇస్తున్న ఫోటో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది.

అయితే సినిమా లో ఏదో ఒక చోట పవన్ ని టార్గెట్ చేసుంటాడని పవన్ కళ్యాణ్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనపై చురకలు అంటించిన Ram Gopal Varma అసెంబ్లీలో స్పీకర్ నిద్రపోయే విషయం మొదలుకొని ప్రభుత్వంపై ప్రజలకు ఏర్పడిన వ్యతిరేకత మొదలగు అనేక విషయాలను ట్రైలెర్ లో ప్రస్తావించాడు.

ఇక 2019 ఎన్నికల తరువాత జరిగిని కొన్ని పరిణామాలను ఆధారంగా తీసుకుని ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తుంది. అయితే ఎన్నికలకు ముందు జగన్ పై దాడి మరియు వైఎస్ వివేకానందరెడ్డి హత్య లాంటి సన్నివేసాలు ఉన్నాయో లేదో తెలియాలంటే రిలీజ్ అయ్యేదాకా వెయిట్ చెయ్యాల్సిందే.

ఇక ట్రైలెర్ లో చాలా క్యారెక్టర్స్ లో కమీడియన్స్ బ్రహ్మానందం, అలీ మరియు  కత్తి మహేశ్ వంటి వారు  ఉండడంతో సినిమా ఎలా ఉంటుందోనన్న ఆసక్తి, ఆందోళన కలగక మానదు. ఈ సినిమా రిలీజ్ కాకముందే ఇంకొక కాంట్రవర్సీకి తెరలేపాడు Ram Gopal Varma.

అదే “మెగా ఫ్యామిలీ” సినిమా తాజాగా ఒక ప్రముక చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన తదుపరి సినిమా మెగా ఫ్యామిలీ అంటూ వివాదం లేపాడు అది కాస్త 24 గంటలు కాకుండానే ఈ సినిమాను నేను తీయడం లేదని తేచి చెప్పాడు.

తాను విన్న కధ 39 మంది పిల్లలున్న మెగా ఫామిలీ పై సినిమా తీయడం నావల్ల కాదని, తనకు చిన్నపిల్లలంటే ఇష్టముండదని అందుకే ఆ సినిమా చేయట్లదన్నాడు వర్మ. దీనిపై చిరంజీవి వర్మకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడని అందువల్ల వర్మ వెనక్కి తగ్గాడని టాలివుడ్ లో చర్చ నడుస్తుంది.