శనివారం, ఏప్రిల్ 20, 2024
HomeసినిమాRakul Preet Singh 250 కుటుంబాలకు అన్నం అందిస్తోంది

Rakul Preet Singh 250 కుటుంబాలకు అన్నం అందిస్తోంది

కొవిడ్ 19 తో దేశంలో నెలకొన్ని పరిస్థితులు అందరికీ తెలిసినవే ఈ నేపథ్యంలో ఎవరికి తోచిన సాయం వాళ్లు అందిస్తూ పేదవారిని ఆదుకుంటున్నారు. కొంతమంది డాక్టర్లకు మాస్క్ లు శానిటైజర్స్ ఇస్తుంటే మరికొందరు డబ్బులు విరాళంగా ఇస్తున్నారు పిఎం రిలీఫ్ ఫండ్ కి, సీఎం రిలీఫ్ ఫండ్ కి చాలామంది సినీతారలు పెద్దమనసుతో విరాళాలు అందిస్తున్నారు. మరికొంతమందికి రోడ్లపక్కన ఉండేవాళ్లకు రోజూ ఫుడ్ ప్యాకెట్స్ అందజేస్తున్నారు.

 

Rakul Preet Singh Image

టాలీవుడ్ హీరోయిన్ Rakul Preet Singh కూడా తనవంతు సాయంగా పేరదవారి కడుపునింపుతోంది. గుడ్గావ్ లోని తన ఇంటికి సమీపంలో ఉన్న స్లమ్ లో కుటుంబాలకు రోజుకు రెండుపూటలా అన్నం పంపీణీ చేస్తున్నారు.

శనివారం నుంచి లాక్ డౌన్ కాలం ముగిసేంత వరకూ వాళ్లకి అలాగే ఆహారం అందిస్తానని ఆమె తాజాగా ఓ వెబ్ సైట్ తో అన్నారు. ఇలా ఎవరికి  తోచింది వాళ్లు చేస్తూ ఈ గడ్డుకాలంలో ఉపాదిలేని వాళ్లను నిరాశ్రయులను ఆదుకోవాలంటూ నెటిజన్లు అంటున్నారు

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular