శనివారం, జూలై 27, 2024
Homeరాజకీయంలాక్ డౌన్ ఉల్లంగించిన ఎంఐఎం ఎమ్మెల్యే .. వారిపై విరుచుకుపడ్డ రాజాసింగ్

లాక్ డౌన్ ఉల్లంగించిన ఎంఐఎం ఎమ్మెల్యే .. వారిపై విరుచుకుపడ్డ రాజాసింగ్

దేశంలో ప్రస్తుతం కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. చాలా చోట్ల రెడ్ జోన్లలో లాక్ డౌన్ ను కఠినంగా అమలుచేస్తున్నారు. తెలంగాణా లో కేసులు రోజు రోజుకీ  పెరుగుతుండడంతో కేసీఆర్ మీడియా ముందు లాక్ డౌన్ కటినంగా అమలుచేయాలంటూనే లాక్ డౌన్ పెంచుకుంటూ పోతున్నారు.

ప్రజలకు మంచి చెప్పాల్సిన నాయకులే నిబందనలను అతిక్రమిస్తున్నారు. తాజాగా ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే మహమ్మద్ బిన్ అబ్దుల్లా శుక్రవారం ద‌బీర్‌పుర ఫ్లైఓవర్ పై పోలీసులు పెట్టిన బారికేడ్లను తొలగించి ఆ బ్రిడ్జ్ పై నుండి వాహానాలను పంపించేసారు.

దీనిపై రాజాసింగ్ స్పందిస్తూ అబ్దుల్లా తో సహా మిగతా ఎంఐఎం నేతలు ఓల్డ్ సిటీలో లాక్ డౌన్ పాటించట్లేదని పోలీసులు తక్షణం వీరిపై చర్యలు తీసుకోవాలన్నారు. అయితే పోలీసులు మాత్రం బారికేడ్ తొలగించే ముందు మా అనుమతి తీసుకున్నారన్నారు.

రాజాసింగ్ మాత్రం కోరోనా పై ఎట్టి పరిస్థితిలో వోడిపోకూడదని ప్రపంచం మొత్తం ఒక యుద్దంలా చేస్తుంటే ఎంఐఎం ఎమ్మెల్యేలు, కొడుకులు, కార్పోరేటర్స్ లాక్ డౌన్ ను అతిక్రమిస్తూ ఎక్కడెక్కడ బ్యారికేడ్లు ఉంటె అవన్నీ తీసిపరేస్తున్నారని అన్నారు.

ఎంఐఎం నేతలు చేస్తున్న పనులు కేసీఆర్ కు కనిపిస్తున్నాయా లేదా అని ప్రశ్నించారు. సాదారణ ప్రజలతో పాటు తమ పార్టీ నేత బండి సంజయ్ లాక్ డౌన్ అమలు చేయలేదంటూ ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసారని, ఇప్పుడు ఎంఐఎం నేతలపై మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా అని ప్రశ్నించారు. ఎంఐఎం పార్టీ ఏమ్మేల్యేలచే అసదుద్దీన్ ఓవైసీ వెనకుండి ఈ పనులు చేయిస్తున్నారన్నారు.

ఓల్డ్ సిటీలో నైట్ పది, పదకొండు, పన్నెండైనా రోడ్లపై తిరిగుతూ షాపింగ్ చేస్తున్నారన్నారు. తెలంగాణాలో వైరస్ చాలా మందికి వ్యాపించినా రంజాన్ సందర్బంగా వారికి ఫ్రీడమ్ ఇచ్చి కేసులను ఎవరికీ తెలియకుండా దాచిపెడుతున్నారని అన్నారు.

హిందువులు ఉగాది, శ్రీరామనవమి, వంటి వాటిని మేము ఇంట్లోనే చేసుకున్నామన్నారు. ప్రస్తుతం వారు రంజాన్ వైభవంగా చేసుకోవాలనే రోడ్లపైకి వస్తున్నారన్నారు. కచ్చితంగా కెసీఆర్ వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ప్రస్తుతం ఈ వ్యవహారం మొత్తం నేషనల్ మీడియా వరకూ వెళ్ళింది.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular