త్వరలో జగన్ ప్రభుత్వానికి మరో ఘులక్ ఇవ్వనున్న రఘురామకృష్ణ రాజు

0
1420
Raghurama Krishna Raju
Raghurama Krishna Raju

ఏపీ లో మద్యం వ్యవహారంపై త్వరలో కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారం సమయంలో జగన్ మోహన్ రెడ్డి నేను చెప్పానంటే చేస్తానంతే అంటూ వెనకడుగు వేసే ప్రసక్తే లేదంటూ ఎన్నికల ప్రచారంలో హోరెత్తించారు. అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటినా మద్య నిషేడంవైపు అడుగులు వెయ్యకపోగా మద్యం రెట్లు పెంచి నాసిరంకం మద్యం వారి చేతిలో పెట్టి మధ్యతరగతి ప్రజల జీవితాలతో ఆటలాడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రానికి  ప్రెసిడెంట్ మెడల్, స్పెషల్ స్టేటస్, అంటూ ప్రపంచంలో ఎవరికీ తెలియని బ్రాండ్లతో ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ప్రభుత్వం వ్యాపారం చేస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

అయితే తాజాగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు ఈ విషయంపై ప్రభుత్వానికి చెక్ పెట్టె పనిలో పడ్డారు. కొత్త బ్రాండ్ల పేరుతో ప్రభుత్వం కొనుగోలు చేసి విక్రయిస్తున్న పలు మద్యం బ్రాండ్ల నమూనాలను ప్రజారోగ్య నిపుణులతో వాటిని పరీక్షించాలని కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి మాండవీయకు రఘురామకృష్ణ రాజు పిర్యాదు చేస్తూ లేఖ రాశారు. రోజూ పనిచేసుకు బ్రతికే శ్రామికులతో పాటు వారి కుటుంభాలకు కూడా నాసిరకం మద్యం వళ్ళ ప్రమాదం పొంచి ఉందంటూ తెలిపారు. రాష్ట్రంలోని కొందరి స్వార్ధ ప్రయోజనం వల్ల మిగతా కుటుంభాలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దయనీయంగా తయారైంది. ఇప్పటికే అప్పులు దొరక్క నానా అవస్థలూ పడుతున్న ప్రభుత్వానికి మద్యం నుంచే చాలా వరకూ చివరి ఆదాయంగా మారిన తరుణంలో రఘురామకృష్ణ రాజు దెబ్బకి జగన్ ప్రభుత్వం మరింత చిక్కుల్లో పడుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి..అమరావతి సమరానికి 600రోజులు …మళ్ళీ ఉవ్వేత్తున ఎగసిన ఉద్యమం

 కార్పోరేషన్ల పేరుతో రాజ్యాంగ విరుద్ధంగా అప్పులు చేసిందంటూ జగన్ ప్రభుత్వానికి కేంద్రం లేఖ

అదరగొడుతున్న Ola Electric Scooter 24 గంటల్లో లక్ష ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ల బుకింగ్

SR Kalyana Mandapam Review | ఎస్.ఆర్. కళ్యాణ మండపం మూవీ రివ్యూ

టోక్యో ఒలింపిక్స్ జావెలిన్ త్రో లో భారత్ కు స్వర్ణం సాదించిన నీరజ్ చోప్రా