ఆదివారం, జూలై 21, 2024
Homeజాతీయంజనతా కర్ఫ్యూ పై ప్రజల స్పందన.. జగన్ అత్యవసర బేటి

జనతా కర్ఫ్యూ పై ప్రజల స్పందన.. జగన్ అత్యవసర బేటి

ప్రధాని మోడీ పిలుపుమేరకు మనదేశ ప్రజలు జనతా కర్ఫ్యూను చక్కగా అమలుచేశారు. ఉదయం పూట కొద్దిగా అక్కడక్కడా జనసంచారం కనిపించినా 8 గంటల తర్వాత ఎవ్వరు బయటకి రాలేదు. ఎక్కడికక్కడ ప్రధాన నగరాలు, కూడళ్లు నిర్మానుషంగా మారిపోయాయి.

భారతీయులుగా ఒక్కతాటిపైకి వచ్చి కర్ఫ్యూ పాటించడం చాలా ఆనందంగా ఉందని నాయకులూ అంటున్నారు. ప్రపంచదేశాలు సైతం భారత్ ని చూసి నేర్చుకోవాలని ఇతరదేశాల కితాబిస్తున్నాయ్.

ఈ ఒక్కరోజే కాకుండా కరోనా ప్రభావం తగ్గేవరకూ ఎక్కువ ఇంటిపట్టునే ఉండటానికి ప్రాధాన్యత ఇస్తే కరోనా మహమ్మారిని తరిమికొట్టేయచ్చని డాక్టర్స్ చెబుతున్నారు. ఎందుకంటే కరోనాకి మందు మనల్ని మనం స్వీయ నిర్బంధం చేసుకుని గుంపులుగుంపులుగా తిరగకుండా ఉండటమే.

అయితే దీనిపై సీఎం జగన్ సాయంత్రం  అత్యవసర కేబినేట్ బేటి అయ్యేయోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి కారణం తెలంగాణా లో కరోనా కేసులు పెరుగుతుండడంతో దీనిని నివారించడానికి ఇంకో రెండు రోజులు కర్ఫ్యూ కొనసాగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.   

విధిగా కొన్నిరోజులు మనం కర్ఫ్యూ పాటించుకోగలిగితే ఈ విపత్తునుంచి బయటపడగలం అందరికి దీనిపై అవగాహనా కల్పించి మానవజాతిని రక్షించుకుందాం..

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular