సైబర్ క్రైమ్ కి 30 ఇయర్స్ పృథ్వి

0
175
prudhvi raj
prudhvi raj

టాలివుడ్ హాస్య నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి పై గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో అనేక ట్రోల్స్ ఆయనపై గట్టిగానే జరుగుతున్నాయి. ఆ మధ్య పృథ్వి ఆడియో టేప్ కూడా బయటపడిన దగ్గర నుంచీ నెటిజన్స్ తనని ఒక ఆట ఆడుకుంటున్నారు.

ఈనేపథ్యంలోనే  టిక్‌టాక్‌ అలాగే  పలు సామజిక మాధ్యమాల్లో కొన్ని పృథ్వి వీడియోలను ఎడిట్ చేసి పెట్టడం తెలిసిందే ఈ వ్యవహారంపై అయన మండిపడ్డారు. తనని కించపరుస్తున్నారని పృథ్వీరాజ్‌ ఆరోపించారు.

ఈ ఘటనపై హైదరాబాద్ లో‌ సైబర్ క్రైం పోలీసులకు పృథ్వి ఫిర్యాదు చేశారు . తన వీడియోలను ఎడిట్ చేసి తన మనోభావాలు నోచ్చుకునేలా తనను అవమానిస్తున్నారని, తనను కించపరిచేలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు పృథ్వి.

ఇలా ట్రోల్స్ చేసేవాళ్లపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు.