శనివారం, జూలై 27, 2024
Homeజాతీయంపంజాబ్ లో జరిగిన బద్రతాలోపం పై ప్రధాని మోదీ తో రాష్ట్రపతి బేటి

పంజాబ్ లో జరిగిన బద్రతాలోపం పై ప్రధాని మోదీ తో రాష్ట్రపతి బేటి

నిన్న ప్రధాని పంజాబ్ పర్యటనలో భాగంగా ఒంటిడా ఎయిర్ పోర్టుకు వెళ్లగా అక్కడ వాతావరణం అనుకూలించక పోవడంతో అక్కడి నుంచి ప్రధాని రోడ్డు మార్గాన పంజాబ్ కు బయలుదారారు అయితే ఇంకొక ముప్పై నిమిషాలలో పంజాబ్ చేరుపోతామనే లోపు ఒంటిడా ఫ్లై ఓవర పైకి ప్రధాని వాహనం రాగానే అక్కడకు పంజాబ్ కు చెందిన నిరసనకారులు రహదారిని పూర్తిగా దిగ్బంధించి భారీగా నినాదాలు చేయడంతో 20 నిమిషాల పాటు రోడ్డుపైనే ఉన్న ప్రధాని వాహనం చివరకు NSG బృందం ఆయన్ను అక్కడి నుండి దగ్గరలో ఉన్న ఎయిర్ పోర్టుకు తరలించారు.

తాజాగా జరిగిన ఈ ఘనతో ప్రధాని పర్యటనలో ఇంత పెద్ద బద్రతా లోపంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో పాటు స్మృతీ ఇరానీ కూడా మండి పడుతూ పంజాబ్ ఘటనపై వెంటనే నివేదిక ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని కోరింది. తాజాగా ఈ ఘటన సుప్రీం కోర్టుకు చేరడంతో ఈ ఘటనను విచారించిన సుప్రీం ఇటు కేంద్రం తో పాటు అటు పంజాబ్ ప్రభుత్వాలకు పూర్తి అఫిడవిట్ దాకలు చేయ్యాలని ఆదేశించింది.

  అయితే నేడు ప్రధాని మోదీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్  పంజాబ్ పర్యటనలో జరిగిన బద్రతా లోపాలపై అక్కడ జరిగిన విషయాలను రాష్ట్రపతి కోవింద్ తో ప్రధాని బేటి అయ్యారు. పంజాబ్ లో జరిగిన ఘటనపై తాను చింతిస్తున్నట్లు ఈ బేటిలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రధానితో తెలిపారు.

అసలు ఈ ఘటనకు ప్రధాన కారణం ఖలిస్థాన్ టెర్రర్ గ్రూప్ ఈ గృపు యొక్క ప్రధాన లక్ష్యం పంజాబ్ లోని సిక్కులకు ప్రత్యెక దేశం కావాలంటూ ఇప్పటికే పలుమార్లు ఉద్యమాలు మొదలు పెట్టారు. అయితే భారత నిఘా విభాగం వీరి వెనుక ఉగ్ర మూఖలు ఉన్నాయనే అనుమానం వ్యక్తం చేస్తూ ఇంటెలిజెంట్ విభాగం వీరిపై ప్రత్యెక నిఘా పెట్టింది.

అయినా వీరి అకృత్యాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. అసలు పంజాబ్ లో సిక్కులు ఎవరూ ప్రత్యెక దేశం కావాలంటూ కోరుకోవడం లేదు అయితే కొంతమంది మాత్రం అక్కడివారిని రెచ్చగొట్టి ఖలిస్థాన్ గ్రూపు లోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు. వీరి వెనుక దేశ విచ్చిన్న దుష్ట శక్తులు ఉన్నాయని ఇంటెలిజెంట్ విభాగం బావిస్తోంది తాజాగా మోదీ ఈ పర్యటన రద్దు చేసుకుని వెనక్కి వెళ్ళిన తరుణంలో ఖలిస్థాన్ వాదులు ప్రధాని మోడీ పై ఇందిరా గాందీ కి పట్టిన గతే నీకూ పండుతుందంటూ అనుచిత వ్యాఖ్యలు చేసారు.

Read Also: భారత ఆర్మీలోని హిందూ-సిఖ్ జవాన్ల పై పాకిస్థాన్ సోషల్ మీడియాలో కుట్రలు

ఖలిస్థాన్ గ్రూపు చేసిన ఈ హెచ్చరికలతో ఇది కచ్చితంగా పక్కా ప్రాణాలికతో చేసిన కుట్రలా కనిపిస్తుంది. అయితే దీనిలో పంజాబ్ సీయం కూడా ఉన్నారనే వార్తలు వ్నిపిస్తున్నాయి. దీనికి ప్రధాన ఉదాహరణ తాజాగా మోదీ మీటింగ్ కు 700 మంది మాత్రమె వచ్చారంటూ పంజాబ్ సీయం తెలుపగా అసలు మోదీ మీటింగ్ ప్రారంభ అవ్వడానికి ముందే మీటింగ్ ప్రాంగణం నిండిపోయింది. తాజాగా ఇప్పుడు మీటింగ్ జరుగుతున్న ప్రదేశం యొక్క వీడియో బయటకు వచ్చాయి.

మోదీ పంజాబ్ పర్యటన ఉన్నా రాష్ట్ర సీయం, డీజీపీ, ఎస్పీ కూడా వేల్లలేదంటే ఆ రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. పైగా పీయం సెక్యురిటీనిమిత్తం వెళ్ళిన పోలీసులు ఖలిస్థాన్ గ్రూపు సభ్యులతో కలిసి టీ తాగుతూ వారితో ముచ్చటిస్తున్నారంటే ప్రధానికి ఆ రాష్ట్రం ఎలాంటి బద్రత కల్పించిందో అర్ధం చేసుకోవచ్చు. కశ్చితంగా ఇది ప్రధానిపై జరిగిన ఎటాక్ గానే తాము బావిస్తున్నట్లు బీజేపీ నాయకులు అంటున్నారు.

 

 

 

 

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular