శనివారం, జూలై 27, 2024
Homeరాజకీయంమహా కూటమి ప్రజా మేనిఫెస్టో విడుదల

మహా కూటమి ప్రజా మేనిఫెస్టో విడుదల

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికలకు ఇంకా కొన్ని రోజులు మాత్రమె సమయం మిగిలి ఉండడంతో మహా కూటమి తమ ఎన్నికల మేనిఫెస్టో ఒకటి విడుదల చేసింది. ఈ మేనిఫెస్టోను  కాంగ్రెస్ పార్టీ టీడీపీ , టీజేఎస్, సిపీఐ పార్టీల నేతలు అందరూ కలిసి ఈ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేసారు.

ఈ మేనిఫెస్టోలో ముఖ్యమైన ప్రధాన అంశాలుగా ప్రజా అవసరాలకు తగ్గట్టు కొత్త అంశాలను చేర్చామన్నారు ఆయా పార్టీ నేతలు. ఈ మేనిఫెస్టోలో అవినీతి నిర్మూలనను ప్రధాన ఎజెండాగా తీసుకుని దానిని ముఖ్య అంశంగా చేర్చామని అన్నారు. ఇది అన్ని వర్గాల ప్రజలనూ ఆకట్టుకునేలా 35 అంశాలతో కూడిన 112 పేజీలు గల మేనిఫెస్టో విడుదల చేసారు.

వీటిలో రైతులు, సంక్షేమం, యువత, ఉద్యోగాలు, వేధ్యరంగ అబివృద్దితో పాటు మరిన్ని కీలక అంశాలతో ఈ మేనిఫెస్టోలో ప్రధానంగా పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తదుపరి ఉద్యమకారులపై ఉన్న కేసులు ఎత్తివేస్తామని ప్రకటించింది.

అంతేకాక రైతులకు ఒక్కసారిగానే రూ. 2 లక్షల వరకూ రైతు రుణమాఫీ చేస్తామని, ఫించను తీసుకునే వారి వయో పరిమితి 60 నుంచి 58 సంవత్సరాలకు తగ్గిస్తామని, మేనిఫెస్టోలో వెల్లడించారు.

అంతేకాక 100 యూనిట్ల లోపు విద్యుత్తు వినియోగదారులకు విద్యుత్తు ఉచితంగా ఇస్తామని కోదండరాం తెలిపారు. అదేవిధంగా ప్రజా సంక్షేమ పధకాలను యధావిధిగా అమలు పరుస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులు అందరికీ నిరుద్యోగ బృతి తప్పనిసరిగా ఇస్తామని ప్రకటించారు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular