మంగళవారం, జూన్ 18, 2024
Homeసినిమాసినిమాలు ఫుల్లు.. అప్డేట్స్ నిల్లు....ఇది ప్రభాస్ ఫ్యాన్స్ పరిస్థితి

సినిమాలు ఫుల్లు.. అప్డేట్స్ నిల్లు….ఇది ప్రభాస్ ఫ్యాన్స్ పరిస్థితి

బాహుబలి సినిమాతో ఫ్యాన్స్ ను సుమారు ఐదు సంవత్సరాలు నిరీక్షణకు గురిచేసిన ప్రభాస్ ఆ సినిమా ఎలాగూ వరల్డ్ వైడ్ గా రికార్డుల  సునామీ సృష్టించింది. తిరిగి సాహో సినిమా రిలీజ్ తర్వాతా మెదలు పెట్టిన రాధేశ్యామ్ సినిమా నుండి ఇప్పటి వరకూ ట్రైలర్ రిలీజ్ చేయకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ట్విట్టర్ లో నిర్మాణ సంస్థలపై విరుచుకుపడుతున్నారు. తాజాగా ప్రేమికుల రోజు సందర్భంగా ట్రైలెర్ అంటూ రాదేశ్యామ్ నుండి గ్లింప్స్ రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ డైరెక్టర్ పై మండిపడ్డారు.

ఇది ఇలా ఉంటే ఒక వైపు ఈ సినిమా చేస్తూనే ప్రభాస్ అఫీషియల్ గా నాగ్ అశ్విన్ సినిమా మరియు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్ , ఓమ్ రౌత్ డైరెక్షన్ లో ఆదిపురుష్ చేస్తుండగా అన్ అఫీసియల్ గా బాలివుడ్ డైరెక్టర్ తో ఒక సినిమా మరియు కొరటాల శివ డైరెక్షన్ లో మరోసినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. సుమారు లైన్ లో అరడజను భారీ సినిమాలు ఉన్నాయి. అయితే వీటిలో నాగ్ అశ్విన్ సినిమా నుండి అప్డేట్ అంటూ ప్రకటించిన నాగ్ అశ్విన్ ఈ నెల 26న ఇస్తానన్న అప్డేట్ ఇవ్వట్లేదని తెలిపారు.

ఒకవైపు రాధేశ్యామ్ అప్డేట్స్ ఇవ్వట్లేదని ఫ్యాన్స్ మంచి మంట మీద ఉండగా నాగ్ అశ్విన్ కూడా ఫ్యాన్స్ తో ఇలా ఆడుకోవడం తగదని సోషల్ మీడియాలో వాపోతున్నారు. ఇక రాధేశ్యామ్ సినిమా రిలీజ్ కి ఇంకా ఇదు నెలలు ఉండగా ప్రభాస్ ఫ్యాన్స్ పరిస్థితి పాపం దయనీయంగా మారింది. అయితే ప్రభాస్ మొత్తం సినిమాలు కలిపి ట్రేడ్ పండితుల లెక్కల ప్రకారం 3500 కోట్ల పైమాటగా చెబుతున్నారు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular