మంగళవారం, జూన్ 18, 2024
Homeసినిమావైరల్ అవుతున్న ప్రభాస్ 20 ఫోటోలు... పోస్టర్ విడుదల మాత్రం అప్పుడే

వైరల్ అవుతున్న ప్రభాస్ 20 ఫోటోలు… పోస్టర్ విడుదల మాత్రం అప్పుడే

సాహో మూవీ తరువాత రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో లవ్ స్టోరీ ని చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రభాస్  సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా కు సంబంధించిన షూటింగ్ యూరప్ లో జరిగింది. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇది ప్రభాస్‌కు 20వ సినిమా.

ఈ సినిమా కి సంబంధించిన  ముహూర్తాన్ని అప్పట్లో లాక్ డౌన్ కు ముందు చాలా ఘనంగా జరిపినట్లు సంచారం . కానీ, అప్పుడు ప్రారంభోత్సవానికి సంబంధించి ఏ ఫొటోస్  సోషల్ మీడియా కు రిలీజ్ చేయలేదు. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ అంత నిరాశ చెందారు. ఇప్పటికే షూటింగ్ సగ భాగం పూర్తయింది.

లాక్‌డౌన్‌కు ముందు జార్జియాలో కీలక షెడ్యూల్‌ను పూర్తిచేసుకుని వచ్చారు. ఒక సేడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్ర బృందం కరోనా ఎఫెక్ట్ తగ్గి లాక్‌డౌన్ నిబంధనలు సడలింపు ఇవ్వగానే హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ మొదలవ్వనుంది.

అయితే ఇది ఇలా ఉంట, ప్రభాస్ ఫ్యాన్స్ అంత ఇప్పటివరకు ఈ సినిమా కి సంబంధించిన సన్నివేశాలు కానీ.. మూవీ క్లిప్స్,  టైటిల్, పోస్టర్స్ కానీ ఎది రిలీస్ చేయకపొడంతో నిరుత్సాహ పడ్డారు . అయితే ఈ రోజు ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఫొటోలను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

అయితే ఇవి ఈ సినిమా లాంచింగ్ ఫొటోలు. ఈ సినిమాను 2018లో హైదరాబాద్‌లో ప్రారంభించారు.  అయితే, లాక్ డౌన్ కారణంగా అందరూ ఇంట్లోనే ఉంటున్నారు. షూటింగ్స్ కి బ్రేక్ పడడంతో  ఎలాంటి సినిమా అప్ డేట్స్ లేక ఫ్యాన్స్ నిరాశచెందారు.

అయితే రీసెంట్ గా ప్రభాస్ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇస్తూ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ట్విట్టర్ ద్వారా ఫొటోలను పంచుకున్నారు. ఈ ఫొటోస్ లో యంగ్ రెబల్ ప్రభాస్ మరియు పూజా హెగ్డేతో పాటుగా  దర్శకుడు రాధాకృష్ణ కుమార్, యూవీ క్రియేషన్స్ టీం వంశీ, ప్రమోద్, కృష్ణంరాజు, వి.వి.వినాయక్, దర్శక ధీరుడు రాజమౌళి పాల్గొన్నారు. ఈ ఫొటోల్లో ప్రభాస్ పూజా హెగ్ధే తో ఎదో డిస్కస్ చేస్తునట్టు ఉన్న ఫోటో బాగా వైరల్ అవుతుంది.

prabhas 20 launching photos
                                                   prabhas 20 launching photos

ప్రభాస్ చాలా అందంగా  ఇప్పటి వరకు కనిపించిన లుక్‌లో కంటే హ్యాండ్‌సమ్‌గా ఉన్నారు. దీంతో రెచ్చిపోయిన  ప్రభాస్ ఫ్యాన్స్ ఫొటోలను సోషల్ మీడియాలో తెగ ఫార్వాడ్ చేస్తున్నారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో లైక్స్, షేర్స్ తో  తెగ వైరల్ అవుతున్నాయి. అయితే మూవీ పోస్టర్ మాత్రం లాక్ డౌన్ పూర్తికాగానే విడుదల చేస్తామని ఇదివరకే చిత్రయూనిట్ ప్రకటించారు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular