బిగ్ బ్రేకింగ్..తబ్లిగ్ జమాత్ పై రంగంలోకి దిగిన ఈడీ.. తబ్లీగ్ చీఫ్ కు షాక్

0
137
Tablighi Jamaat Chief Moulana saad
Tablighi Jamaat Chief Moulana saad

కరోనా పై ప్రపంచం పోరాడుతున్న సమయంలో దేశం లో కూడా అలర్ట్ కొనసాగుతుండగా నిబంధనలకు విరుధంగా ఢిల్లీలోని నిజాముద్దీన్ లో జరిగిన తబ్లీగి జమాత్ మర్కజ్ ప్రార్ధనలు కరోనా వైరస్ వ్యాప్తిని అమాంతం పెంచేసాయని అధికారులే తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా అప్పటివరకూ పదుల్లో  ఉన్న కేసులు ఒక్కసారిగా వందలకు ఎగబాకాయి ఈ నేపథ్యంలో తబ్లిగ్ జమాత్ చీఫ్ మౌలానా మహమ్మద్ సాద్ పై పోలీసులు పలు సెక్షన్స్ క్రింద కేసులు నమోదు చేశారు.

గుమిగూడకూడదని చెబుతున్నా ప్రార్ధనలు చెయ్యడం అంతేకాకుండా ఇతర దేశాలవారిని ప్రార్థనలకు ఆహ్వానించడం పై అందరూ అసహనం వ్యక్తం చేస్తున్నారు దీనిపై కేంద్రం, అలాగే ఢిల్లీ ప్రభుత్వం కూడా సీరియస్ గానే ఉంది. దీనిపై తాజాగా ఈడి కూడా రంగంలోకి దిగింది.

జమాత్ చీఫ్ పై మనీలాండరింగ్ కేసు నమోదుచేసింది ఈడి. గత మార్చ్ లో ఢిల్లీలో మర్కజ్ ప్రార్ధనలు నిర్వహించడం వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పెట్టిన ఆంక్షలు ఉల్లంఘించడంపై ఢిల్లీ పోలీసులు మార్చి 31 న  ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతం తాజాగా ఈడి దీని ఆధారంగా తబ్లిగ్ జమాత్ చీఫ్ మౌలానా మహమ్మద్ సాద్ పై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.

దేశం మొత్తం కరోనాపై పోరాడుతున్న తరుణం లో ఢిల్లీలోని నిజాముద్దీన్ లో ఆరంతస్తుల తబ్లిగ్ బిల్డింగ్ లో పెద్ద ఎత్తున గుమిగూడి ప్రార్ధనలు చెయ్యడం ఢిల్లీ పోలీసులు అలాగే కేంద్ర నిబంధనలను ఉల్లంఘించడం పై తబ్లిగ్ చీఫ్ తో పాటు మరో ఆరుగురిపై కేసులు నమోదయ్యాయి.