ఆదివారం, జూలై 21, 2024
Homeజాతీయంనువ్వే ఓ యోధుడివి అవ్వాలి...ప్రదాని నరేంద్ర మోడీ

నువ్వే ఓ యోధుడివి అవ్వాలి…ప్రదాని నరేంద్ర మోడీ

ప్రపంచ దేశాలకు  పెను సవాలుగా మారింది కరోనా ఇక భారత్ లో ఈ కరోనా ని ఎదుర్కోవడంలో ముందడుగులులో ఉంది. ప్రజలంతా మంచి అవగాహనతో ముందుకెళుతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇక దేశంలో కరోనా ప్రజాలకు పెద్దసవాలని కరోనా వైరస్ పై జరుపుతున్న ఈ పోరులో మనవంతుగా ప్రతి  ఒక్కరు  యోధులేనని తెలిపారు  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.

కరోనాపై ఈ  పోరాటంలో భారత సేవా శక్తి స్పష్టంగా కనిపిస్తోందన్నారు.  మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడిన ప్రధాని అనేక అంశాలపై మాట్లాడారు. ప్రపంచదేశాలతో  పోల్చితే మన భారతదేశ  జనాభా చాలా ఎక్కువని, అలాగే మన భారత్ దేశానికి పెద్ద  సవాళ్లు కూడా ఎక్కువగానే ఉన్నాయని అన్నారు.

అయినప్పటికీ మిగతా వేరే దేశాలలాగా ఇండియాలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందలేదని, ఇందుకు ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యలే మేలు చేశాయన్నారు. మిగతా ఇతర దేశాలతో పోల్చినప్పుడు భారత దేశంలో కరోనా మరణాలు చాలా తక్కువగా ఉన్నాయని మోడీ అన్నారు.

కరోనా అధికంగా వ్యాపించకుండా విధించిన లాక్ డౌన్ వల్ల  ముఖ్యంగా పేదలు, వలస కార్మికులు అనేక  ఇబ్బందులు పడ్డారని, వారి దుస్థితి మాటల్లో చెప్పలేనిదని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ మహమ్మారి కరోనా వల్ల ఇబ్బంది పడని వర్గమంటూ లేదన్నారాయన. వలస కార్మికులు పడుతున్న సమస్యల పరిష్కారానికి ‘మైగ్రేషన్ కమిషన్’  పేరిట ఓ కొత్త సంస్థను ఏర్పాటు చేసే యోచన ఉందని అయన ప్రకటించారు. వారిని అన్ని విధాలుగా ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందని చెప్పారు.

మన దేశంలో ఉన్న వలస జీవులను వారి సొంత ఊళ్లకు తరలించేందుకు రైల్వే సిబ్బంది, ప్రభుత్వ సంస్థలు, మరియు కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాలు, స్థానిక సంస్థలు సైతం వీరికి  కృషి చేశాయని, వారికి ఆహారం , నీరు మరియు వసతి సౌకర్యాలు సమకూర్చాయని పేర్కొన్న ఆయన ’ఈ వర్గాలనన్నింటినీ కలిపి ‘కరోనా వారియర్స్’ గా ఆయన అభివర్ణించారు.

వలస కార్మికులను రైళ్లు, బస్సులలో వారి ప్రాంతాలకు పంపేందుకు  పడిన కష్టాలకు గాను ఆయా రాష్ట్రాలను ప్రత్యేకంగా అభినందించారు. సోతుళ్ళకు చేరిన వాళ్లను  క్వారంటైన్ చేయడం,  వాళ్లకు తగిన  ట్రీట్ మెంట్ ఇప్పించడంవంటి చర్యలను ఆయన ప్రస్తావించారు.

కరోనా వ్యాప్తిని నివారించేందుకు మరింతగా బాధ్యత వహిస్తూ మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలని, ఆరు అడుగుల దూరం ఖచ్చితంగా పాటిస్తూ, మాస్కులు వేసుకోవడం తప్పనిసరి అవసరంగా ఇంకా ఉందని మోదీ పేర్కొన్నారు. సాధ్యమైనంతవరకూ ఇళ్లలోనే ఉండాల్సిన అవసరం కూడా ఉందన్నారు.

ప్రతి మనిషి సపోర్టుతో కరోనా మహమ్మారిని మనం అదుపు చేయగలుగుతామని దీనిపై విశ్వాసం తనకు ఉందని ఆయన అన్నారు. ఇక దేశాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకువెళ్ళవలసిన అవసరం ఉందని, అందువల్లే లాక్ డౌన్ 5.0 దశలో చాలా మినహాయింపులు ఇచ్చామని మోదీ తెలిపారు.

 

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular