ఇప్పటివరకు మనం రూపాయి రెండు రూపాయలు ఇలా తక్కువ మొత్తంలో మాత్రమే కాయిన్స్ చూసాం. అయితే ఈ రోజు రాజమాత విజయరాజే సింధియా శత జయంతిని సందర్బంగా మోదీ రూ. 100 నాణేన్ని విడుదల చేశారు. దీన్ని పురస్కరించుకుని వీడియో లింక్ ద్వారా మాట్లాడిన ప్రధాని రాజ మాత జీవితం ఈ జెనరేషన్ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని అన్నారు.
రాజ మాతగా ఉన్నపటికీ ఆమె పేద, సామాన్య ప్రజల అభివృద్ధి కోసం కష్టపడుతూ వచ్చారని మోదీ కొనియాడారు. ఒకానొక సమయంలో జనసంఘ్ నాయకురాలిగా అలాగే బీజేపీ వ్యవస్థాపక సభ్యురాలిగా విజయరాజే సింధియా భారతీయ జనతా పార్టీకి అందించిన సేవలు వర్ణనాతీతం అన్నారు ప్రధాని మోడీ. ఆ రాజమాత గౌరవార్థం కొత్తగా రూ. 100 నాణేన్ని తీసుకురావడం తనకు దక్కిన అదృష్టమని అన్నారు ప్రధాని మోడీ.