ఆదివారం, మే 26, 2024
Homeజాతీయంఅసలు ఈ ప్లాస్మా థెరఫీ అంటే ఏమిటి ? కరోనా అనే మహమ్మారిని ఎలా తొలగిస్తుంది

అసలు ఈ ప్లాస్మా థెరఫీ అంటే ఏమిటి ? కరోనా అనే మహమ్మారిని ఎలా తొలగిస్తుంది

సాదారణంగా మానవ శరరంలో ఉండే రక్తం లో సుమారు సగానికి పైగా నీరు లాంటి ఒక పదరార్థం కలిగి ఉంటుంది. దీనినే ప్లాస్మా అని అంటారు ఈ ప్లాస్మా లో రోగ నిరోధక కణాలు ఉంటాయి. ఇవి కరోనా నుండి పూర్తిగా కోలుకున్న వ్యక్తికి 2 లేదా 3 సార్లు కరోనా పరీక్షలు నిర్వహించి వారు పూర్తిగా కోలుకున్నారని నిర్ధారించిన తర్వాత వారిని 14 రోజులు క్వారెంటెన్ లో ఉంచి తర్వాతా వారి రక్తాన్ని బాగా పరీక్షించి వారి నుండి కొంత పరిమాణంలో ప్లాస్మా ను సేకరిస్తారు.

ఈ పద్దతిలో సేకరించిన’ ఆ ప్లాస్మా ను అస్పరిసిస్ అనే సాంకేతిక పద్ధతిని ఉపయోగించి రక్తంలోని తెల్ల రక్త కణాలను వేరుచేసి దానినుండి ప్లాస్మా ను వేరు చేసి తిరిగి తీసిన ఆ రక్తాన్ని రక్త దాత శరీరంలోకి పంపించేస్తారు. ఈ విధంగా సేకరించిన ప్లాస్మాని రోగి శరరంలోకి ఒక్కొకరికి 200 ఎంఎల్ చొప్పున ఎక్కిస్తారు ఈ పద్ధతినే  ప్లాస్మా థెరఫీ అని అంటారు.

ఇంకా సులభంగా చెప్పాలంటే  కరోనా వైరస్‌ వచ్చి కోలుకున్న వ్యక్తి రక్తంలోని యాంటీ బాడీస్‌ను తీసుకుని వైరస్‌ బారిన పడిన బాధితుడి రక్తంలోకి ఎక్కించడాన్ని ప్లాస్మా థెరపీగా పిలిస్తారు దీన్ని “కన్వాల్ సెంట్ ప్లాస్మా థెరపీ” అని కూడా  అంటారు.

ఈ యాంటీ బాడీస్‌ మనిషి యొక్క రక్తంలోని ‘ప్లాస్మా’ అనే ద్రావకంలో కలిసి ఉంటాయి. కొన్ఢిని రోజుల క్రితం డిల్లీ లో గల ఒక ఆసుపత్రిలో కరోనా పాజిటీవ్ రోగి  చికిత్స పొందుతున్న  ప్లాస్మా థెరపీ తనకు ఇవ్వగా ఆ వ్యక్తి నుండి సానుకూల ఫలితాలు రాబట్టగలిగారు. అయితే ప్లాస్మా థెరపీ చేసిన తర్వాత ఆ వ్యక్తి పరిస్థితి గతంలో కంటే చాలా మెరుగుపడింది.

అక్కడినుండి నాల్గవ రోజు నాటికి వెంటిలేటర్ సపోర్ట్ ను  అతనికి తొలగించారు. దీంతో క‌రోనాను అడ్డుకునేందుకు ప్లాస్మాథెర‌పీ ఒక బ్రహ్మాస్త్రం లాగా ప‌నిచేయ‌గ‌ల‌ద‌ని డాక్టర్లు అబిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మనదేశం ‌ సైతం అదే థెరపిని ఉపయోగిస్తోంది.

ఈ ప్లాస్మా థెరపి వల్ల రోగి కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాటితోపాటు అనేక అపాయాలు కూడా ఉన్నాయి. అవేంటంటే   రక్త దాతకు హైపిటైటిస్ బీ (B), సి (C) హెచ్ఐవి లాంటి ఎలాంటి దీర్ఘకాల జబ్బులున్నా మరే ఇతర వైరస్ లు ఉన్న ప్లాస్మా థెరపీ తీసుకున్న రోగులకు కూడా ఇవి సంక్రమిస్తాయి.

అయితే రక్త దాత నుంచి తీసుకున్న ప్లాస్మాలో కరోనా వైరస్ ను బలంగా ఎదుర్కొనే స్థాయిలో యాంటీ బాడీస్ వాటిలో‌ ఉండాలి. అలా కాని పక్షంలో  ప్లాస్మా థెరపి ఇచ్చిన వ్యక్తికి జబ్బు తగ్గకపోగా మరింత ముదిరే అవకాసాలు కూడా ఉన్నాయి. ప్రస్తుత సమయంలో అది తగ్గిపోయినా మళ్లీ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.

ఇదేమి కొత్తగా వచ్చిన వైద్య ట్రీట్మెంట్ ఏమీ కాదు పూర్వం ఈ తెరఫీతో అబొల వంటి వైరస్ లను శరీరంనుండి తొలగించడానికి ఉపయోగించారు. ఈ విధంగా ప్లాస్మా థెరపీ ఇచ్చిన తర్వాత కరోనా సోకిన రోగి కి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular