శుక్రవారం, ఏప్రిల్ 19, 2024
Homeజాతీయంపెట్రోల్ రేట్లతో సామాన్యుడి బతుకు మరింత భారం | Petrol Price in AP

పెట్రోల్ రేట్లతో సామాన్యుడి బతుకు మరింత భారం | Petrol Price in AP

Petrol Price in AP : నేడు దేశంలో దాదాపు ప్రతీ రాష్ట్రంలోనూ పెట్రోల్ రెట్లు 100కి చేరుకున్నాయి. ఆంద్రాలో మాత్రం చాలా చోట్ల పెట్రోల్ 105 రూపాయలు ఉండగా డీజిల్ 100కి చేరుకుంది. దీనితో పేద మరియు మద్య తరగతి ప్రజలకు రోజూ పెరుగుతున్న ఈ పెట్రోల్ ధరలతో నెల మొత్తానికి ఒక కుటుంభాన్ని పోసించలేని పరిస్థితి సగటు పెదవానికి ఏర్పడింది.

గత కొన్నాళ్ళుగా కర్ఫ్యూ కారణంగా పెద్దగా బయటకు రాని వారు నేడు ఉద్యోగ పనులకోసం ద్విచక్ర వాహనం బయటకి తీయడంతో మండుతున్న పెట్రోల్ రెట్లను చూసి అల్లాడుతున్నారు. ఒక వైపు ప్రతీ రోజూ 30 నుండి 40 పైసలు వరకూ పెట్రోల్ రేటు పెరుగుతుండడంతో రవాణా చార్జీలు పెంచడంతో నిత్యావసర వస్తువులు, కూరగాయలు విపరీతంగా పెరుగుతున్నాయి.

ఇప్పటికే కరోనా కారణంగా చేయడానికి పనిలేక  నానా అవస్థలూ పడుతున్న ప్రజలపై ప్రభుత్వాలు కనీస కనికరం చూపకుండా ప్రజల జీవితాలను మరింత అంధకారంలోకి నెడుతున్నాయి.  ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత పధకాలను చూసి ఆనంద పడాలో లేక ప్రభుత్వం రోజూ పెంచుతున్న పెట్రోల్ రేట్లను చూసి ఏడవాలో తెలియని స్థితిలో ఉన్నారు ప్రజలు.       

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular