పశ్చిమగోదావరి జిల్లా లో వ్యక్తి మృతి

0
134
man suddenly dead in west godavari
man suddenly dead in west godavari

ఎక్కడిక్కడ లాక్ డౌన్ కఠినంగా అమలౌతున్న నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం పొద్దున్న పాలకొల్లు లోని ఎల్ ఆర్ నగర్లోని ఓ టిఫిన్ సెంటర్ దగ్గర జనాలు మూగి ఉండంగా అదే సమయంలో అక్కడికి పోలీసులు రాగా పోలీసులను చూసిన జనం పరుగులు తీసారు. ఆ గుంపులో ఉన్న ఆంజనేయులు అనే వ్య క్తి అక్కడినుంచి వెళ్లపోవాలనే తొందరలో అక్కడి నుంచిపరుగులు తీశాడు.

అలా పరిగెడుతూ ఆంజనేయులు ఒక్కసారిగా కుప్పకూలిపోయి అక్కడే ప్రాణాలు వదిలాడు. స్థానికులు కొందరు పోలీసులకు సమాచారం అందించారు. ఉన్నట్టుండి పరుగుపెట్టడం వల్ల గుండె ఆగిపోయుంటుందని అందరూ అనుమానిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నారు. ప్రజలెవరూ లాక్ డౌన్ పూర్తి అయ్యేవరకూ బయటకు రావద్దని గుమిగూడొద్దంటూ పోలీసులు ప్రాదేయపడుతున్నారు.