శనివారం, ఏప్రిల్ 20, 2024
Homeక్రీడలుఅచ్చం దోనీని పోలిన వ్యక్తి ..ఫోటోల కోసం భారీగా చేరుకున్న ఫ్యాన్స్

అచ్చం దోనీని పోలిన వ్యక్తి ..ఫోటోల కోసం భారీగా చేరుకున్న ఫ్యాన్స్

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ని పోలిన వ్యక్తి జార్ఖండ్ లోని రాంచీలో లోటా పంచాయతీ ఎన్నికల్లో చూసి అక్కడికి ఓటు వెయ్యడానికి వచ్చిన ఓటర్లు ఒక్క సారిగా షాక్ అయ్యారు. పూర్తి వివరాలలోకి వెళితే తాజాగా గుజరాత్ లోని రాంచీలో లోటా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి దీనిలో భాగంగా ఆ పోలింగ్ భూత్ లో విధులు నిర్వహిస్తున్న ఒకతన్ని అక్కడి ఓటర్లు చూసారు తీరా చూస్తే అచ్చం అతను ధోనీ లాగే ఉండడంతో  ఓటర్లు ఆ వ్యక్తిని చూసి ధోని అనుకుని షాక్ అయ్యారు.

అయితే ధోని లాగా ఉన్న వ్యక్తి పేరు వివేక్ కుమార్ సాదా సీదాగా ఎన్నికల డ్యూటీలో తన పని తాను చేసుకునే అతన్ని అక్కడి ప్రజలు చూసి అతనితో పోటోలు దిగారు. అయితే ఈ విషయం బయటికి పొక్కడంతో ఆ పోలింగ్ బూత్ కి భారీగా జనం చేరుకున్నారు. ప్రస్తుతం ధోనీని పోలివున్న వివేక్ కుమార్ పోటోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular