మంగళవారం, జూన్ 18, 2024
Homeరాజకీయంవాళ్ళని రాళ్ళతో కొట్టి చంపండి .. రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపండి .. రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

Revanth Reddy : తెలంగాణా కాంగ్రెస్ కి పీసీకీ అధ్యక్షునిగా ఎన్నికైన కొద్ది రోజులకే ఎంపీ రేవంత్ రెడ్డి తనదన పంథాలో వ్యూహాలు రచిస్తున్నారు. ఒక వైపు పార్టీపై , తనపై అసమ్మతి రాగం వెలిబుచ్చే నాయకులను శాంతి పరుస్తూ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి తన వంతు శాయశక్తులా కృషి చేస్తున్నారు.

రేవంత్ పీసీసీ అధ్యక్ష్యుడైతే కాంగ్రెస్ పార్టీ చాలావరకూ కాళీ అయిపోతుందని విమర్శించిన వారికి రేవంత్ రాజకీయ వ్యూహాల వల్ల పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. రేవంత్ రెడ్డి అధ్యక్షునిగా ఎన్నికైన రోజు తన సన్నిహితులు అసమ్మతి వర్గాలను గురించి మాట్లాడుతూ పీసీసీ పదవిని అలంకరించడానికి కాదని రాబోయే ఎన్నికల్లో ఇప్పటినుంచే కొత్త స్ట్రాటజీ ని అవలంబించి ఎన్నికల్లో విజయం సాదించడానికేనని అని అనగా దీనిని నిజం చేస్తూ Revanth Reddy ఎప్పుడూ చూడనంత యాక్తీవ్ గా పని చెస్తుండడం చూసి కాగ్రెస్ నాయకులు ఆశ్చర్యలోతున్నారు.

ఎందుకంటే పార్టీ లోని అసమ్మతి నాయకుల పతీ ఒక్కరి ఇంటికి వెళ్లి మరీ వారిని పరామర్శిస్తున్నారు. అంతేకాక కాంగ్రెస్ పార్టీలో నెగ్గి పదవి పొందినవారు పార్టీ పిరాయిస్తే వాళ్ళను కార్యకర్తలు వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపమంటూ మీడియా వేదికగా సంచలన కామెంట్స్ చేసారు.

అంతే కాక అలాంటి వారిని గ్రామం నుండి బహిష్కరణ చయమంటూ పిలుపునిచ్చారు. పార్టీ పిరాయించిన వాళ్ళపై స్పీకర్ చర్యలు తీసుకోవాలన్నారు. అలా తీసుకోకపోతే  పిరాయింపులను ప్రోత్సహించినందుకు మీపై కూడా క్రిమినల్ కేసులు వేస్తామన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ లో కొత్త నాయకుడి వల్ల కేడర్ లో ఫుల్ జోష్ వచ్చిందంటూ కాంగ్రెస్ నేతలు చెప్పుకొస్తున్నారు.     

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular