గురువారం, జూన్ 8, 2023
HomeసినిమాPawan Kalyan, Ravi Teja మల్టీ స్టారర్ క్రేజీ కాంబో

Pawan Kalyan, Ravi Teja మల్టీ స్టారర్ క్రేజీ కాంబో

టాలీవుడ్ లో క్రేజీ కాంబో పట్టా లెక్కబోతోంది  అయితే మల్టీ స్టారర్ ట్రెండ్ బాలీవుడ్ లో  మొదలై కొన్నాళ్లుగా మల్టీస్టారర్ హడావిడి టాలీవుడ్ లోనూ  ఊపందుకుంది. ఇప్పుడు  Pawan Kalyan మరియు Ravi Teja కలిసి ఒక మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నారనే వార్త టాలివుడ్ వర్గాల్లో జోరందుకుంది.

వీళ్లిద్దరు కలిస్తే ఇక Pawan Kalyan మరియు Ravi Teja ఫ్యాన్స్ కి పూనకాలు రావడం  కాయం ఎందుకంటే పవన్ కళ్యాణ్ పవర్ కి, రవితేజ మాస్ ఫాలోయింగ్ కి ఇక తిరుగుండదు ఇక  ఈ మూవీ తమిళ్ లో విక్రమ్ వేద పేరుతో రేలీజైంది. ఇక తెలుగు రైట్స్ ను డాలి దర్శకత్వం లో రవితేజ తో నేల టికెట్ సినిమా తీసిన  రామ్ తాళ్ళూరి తీసుకున్నారని వార్తలు వసున్నాయి.

తమిళ్ లో క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో విక్రమ్ అనే పోలీస్ ఆఫీసర్ మరియు వేద  అనే గ్యాంగ్ స్టర్ కథా నేపథ్యంలో సాగుతుంది  మాధవన్ మరియు విజయ్ సేతుపతి కలిసి నటించిన ఈ సినిమా తమిళ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఇక తెలుగు విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ మరియు రవితేజ లలో పోలీస్ క్యారెక్టర్ మరియు గ్యాంగ్ స్టర్ క్యారెక్టర్ లలో ఎవరు చేస్తారనే విషయం పై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ట్రోల్  చేస్తున్నారు.

అయితే పవన్ కళ్యాణ్ కు వకీల్ సాబ్ మరియు ఇంకో రెండు సినిమాలు వరుసలో ఉన్నాయి. అయితే అజయ్ భూపతి  మరియు రవితేజ చేయాల్సిన మహా సముద్రం సినిమా కూడా దీనికోసం వదులుకున్నట్టు టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది. 

ఇక రవితేజ మరియు పవన్ కళ్యాణ్ లు ఎప్పటి నుంచో మంచి స్నేహితులు. ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని పవన్ కళ్యాణ్ మరియు రవితేజ ఫ్యాన్స్ ఈగర్ గా  వెయిట్ చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular