మంగళవారం, జూన్ 18, 2024
Homeఅంతర్జాతీయంParliament Security Breach: పార్లమెంట్ లోకి చొరబడ్డ అగంతకులు

Parliament Security Breach: పార్లమెంట్ లోకి చొరబడ్డ అగంతకులు

గతంలో పార్లమెంట్‌ పై ఉగ్రదాడి డిసెంబర్ 13న జరిగింది అయితే ఇప్పటికి 22 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వారికి నివాళులు అర్పించడం కోసం నేడు ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌ ప్రత్యెక సమావేశం ఏర్పాటు చేసారు. అయితే  ప్రేక్షకుల ఉండే గ్యాలరీలో నుంచి ఇద్దరు వ్యక్తులు ఒక్కసారిగా పార్లమెంట్ కిందకు దూకడంతో సభలో గందరగోళం పరిస్థితి నెలకొంది. అదే సమయంలో బీజేపీ ఎంపీ స్వాగెన్ ముర్ము లోక్‌సభలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

బూట్లలో స్ప్రే తీసి విడుదల చేసిన అగంతకుడు

యువకుడు అతని బూట్లలో స్ప్రే రకం ఏదో కేన్ ను బయటికి వదులుతూ అతను సభ బెంచీలపైకి దూకుతూ వాటిపై ఎగురుకుంటూ బెంచీలపై ఉన్న ఎలక్ట్రానిక్ ట్యాబ్ లను తొక్కుకుంటూ పోడియం వైపుకు వెళుతుండగా ఈ సమయంలో సభలో పసుపు రంగు వాయువులు మొత్తం వ్యాపించడం ప్రారంభించింది. పార్లమెంట్ సభ మొత్తం గందరగోళ వాతావరణం నెలకొనడంతో ఎంపీలు ఒక్కసారిగా బయటకు పరుగులు తీసారు దీనితో సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.

బద్రతా సిబ్బందికి అప్పగించిన ఎంపీలు

లోక్‌సభలో జీరో అవర్ జరుగుతున్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. జరిగిన ఈ ఘటనపై ఓ ఎంపీ మాట్లాడుతూ లోక్ సభ జరుగుతుండగా గేలరీ వైపు నుండి లాబీ లోకి ఒక్కసారిగా కిందకు దూకాడు ఓ బాలుడు. ఈ క్రమంలో అతని షూలోంచి పర్సు లాంటిది బయటకు తీసి దానిని రిలీజ్ చెయ్యగా దాని నుండి ఒక స్ప్రే లాంటి వాయువు బయటకు రిలీజ్ చేస్తూ పరుగుగులు పెట్టాడు. అనంతరం కొందరు ఎంపీలు ఆయనను పట్టుకుని  భద్రతా సిబ్బందికి అప్పగించారు.

అగంతకులను విచారిస్తున్న బద్రతా సిబ్బంది

ఆ యువకుడిని సభ నుంచి బయటకు తీసుకెళ్తుండగా అతని బూట్ల నుంచి పసుపు రంగు పొగలు వస్తూనే ఉన్నాయి. దీంతో చుట్టూ పసుపు వాయువు వ్యాపించింది. ఇది ఎలాంటి పసుపు వాయువు, ఏమైనా రసాయనాలు ఉన్నాయా, ఎంత ప్రమాదకరమైనది, భద్రతను ఉల్లంఘించిన వారి ఉద్దేశ్యం ఏమిటి అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సబలో నినాదాలు చేసిన ఆగంతకులు

ఆడియన్స్ గ్యాలరీ నుంచి దూకిన వ్యక్తి పేరు సాగర్ శర్మ గా తెలుస్తోంది అయితే పార్లమెంట్ లో ప్రవేశించిన ఆ వ్యక్తులు న్యాయం గెలవాలి, నల్ల చట్టాలు పోవాలి “తానా షాహి” నశించాలి, నియంతృత్వం నశించాలి  అంటూ నినాదాలు చేసారు అంతేకాక మీరు మమ్మల్ని చంపినా పర్వాలేదు ఎందుకంటే మేము దేశం కోసం పోరాడుతున్నాం అంటూ నినాదాలు చేసారు .

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular