శనివారం, జూలై 27, 2024
Homeభక్తిపాకిస్థాన్ లో 1500 సంవత్సరాల పురాతన పంచముఖి హనుమాన్ విగ్రహం దర్శనం

పాకిస్థాన్ లో 1500 సంవత్సరాల పురాతన పంచముఖి హనుమాన్ విగ్రహం దర్శనం

ఆంజనేయస్వామి ఈ పేరు తెలియని వారు ఎవరూ ఉండరు ఈయన గుడి లేని ఊరు అంటూ ఉండదేమో. అయితే హనుమంతుడిని నమ్మిన వారిని ఎల్లవేళలా కాపాడుతాడు. తన భక్తులైనా లేక శ్రీరాముని భక్తులైనా ఆపదలో ఉన్నవారిని బయటపడేస్తాడు. ప్రస్తుతం భారత దేశ వ్యాప్తంగా అనేక హనుమాన్ దేవాలయాలు ఉన్నాయి. అయితే గత సంవత్సరం మన దాయాది దేశం పాకిస్థాన్ లో సైతం పంచముఖి హనుమాన్ మందిరం వెలసి అక్కడి హిందువుల పాలిట కొండత దైర్యం ప్రసాదించాడు హనుమంతుడు.

 వివరాలలోకి వెళితే పాకిస్థాన్ దేశంలో హిందువులు అదికంగా ఉండే సింద్ ప్రావిన్స్ పట్టణంలో కరాచి లో ఉన్న సోల్జర్ బజార్ లో గత సంవత్సరం అక్కడి పురావస్తు శాస్త్రవేత్తలు చేపట్టిన త్రవ్వకాలలో 8 అడుగుల ఏఖశిలా పంచముఖీ హనుమాన విగ్రహం బయట పడడంతో ఒక్కసారిగా అధికారులు ఖంగుతిన్నారు. అయితే ఈ త్రవ్వకాలను మరింత కొనసాగించగా అనేక వానర మూఖల విగ్రహాలతోపాటు కృష్ణుడు, వినాయకుడు వంటి  మరిన్ని విగ్రహాలు బయటపడడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

దీనితో ఈ విగ్రహాలను పురావస్తు శాఖవారు బద్రపరచారు అయితే ఆ ప్రాంతంలో ఉన్న హిందువులు మా స్థలంలో హనుమాన్ మందిరం నిర్మాణానికి అనుమతులు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరగా ప్రభుత్వం ఈ విషయాన్ని పక్కన పెట్టేసింది. అయితే అక్కడ హనుమాన్ మందిర నిర్మాణం చేయకూదడనే ఉద్దేశ్యంతో ఆ స్థలాన్ని ఆక్రమించుకొని హిందవులను బెదిరించడం మొదలుపెట్టడంతో అక్కడి స్థానిక నాయకులతో తమ మొర చెప్పుకున్నా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది.

చేసేదేమీలేక హనుమంతునిపై భారం వేసి ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి కోర్టుని ఆశ్రయించగా కోర్టు ఆస్థలం హిందువులదేనంటూ ఆర్డర్ ఇచ్చింది అంతేకాక ఆ స్థలంలో హనుమాన్ మందిరం కట్టుకోవడానికి ఎలాంటి అభ్యంతరాలూ లేవని చెప్పడంతో అక్కడి హిందూ సమితి పంచముఖి హనుమాన్ ఆలయ నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం ఆ ఆలయంలో పంచముఖి హనుమాన్ విగ్రహంతో పాటు శ్రీరాముడు, సీతాదేవి, పంచముఖి వినాయకుడు, కృష్ణుడు, శివుడు, వంటి అనేక విగ్రహాలను ప్రతిష్టించారు.

ప్రస్తుతం కొన్ని పనులు మినహా ఆలయం పనులు పూర్తికావోచ్చాయి. ఆలయ నిర్మాణం పూర్తికావడంతో స్థానిక హిందువులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హనుమంతుడు మా కష్టాలను తీర్చడానికి మావద్దకు వచ్చాడని, హనుమాన్ ఆలయం ప్రతిష్ట తో మాకు మరింత దైర్యం వచ్చిందంటన్నారు. అంతేకాక పంచముఖి హనుమాన్ దర్శనంతో గ్రహబాదలు, ఆరోగ్య సమస్యలు, వంటి వాటి నుండి హనుమాన్ కాపాడతాడని నమ్మకంగా చెబుతున్నారు.

అంతేకాక తయారు చేసిన విగ్రహం కంటే తమకు హనుమంతుడు స్వయంభువుగా వెలిసిన విగ్రహం కావున మరింత ఎఫెక్ట్ ఎక్కవగా ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం అక్కడ హనుమంతుని మహిమలను అక్కడి ముస్లింలు కూడా హనుమంతుని దర్శించుకోవడం ఆ స్వామివారి మహత్యం జై శ్రీరామ్…..                

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular