శనివారం, జూలై 27, 2024
HomeజాతీయంPAN Aadhaar Link: పాన్ ఆధార్ లింకింగ్ పై కొత్త అప్డేట్

PAN Aadhaar Link: పాన్ ఆధార్ లింకింగ్ పై కొత్త అప్డేట్

పాన్ ఆధార్ విషయం లో జనాల్లో రోజుకో గందరగోళ పరిస్థితి నెలకొంది తాజాగా పాన్ ఆధార్ లింకింగ్ డేట్ ముగియడంతో మళ్ళీ డేట్ పొడిగించారనే వార్తలు బయటకు రావడంతో Incom Tax Department ఈ విషయంపై ఒక క్లారిటీ ఇచ్చింది. జూన్ 30వ తేదీ చివరి రోజు కావడంతో ఇప్పటి వరకూ PAN Aadhaar Link చెయ్యని హోల్డర్స్ భారీగా ఉండడంతో సర్వర్లు మొరాయించాయి.

కొందరికి డాక్యుమెంట్ అప్లోడ్ చేసేటప్పుడు సమస్యలు తలెత్తగా మరికొందరికి ప్రోసెస్ అంతా కంప్లీట్ చేసి చివరి పేమెంట్ వద్దకు వచ్చేసరికి సర్వర్ పనిచెయ్యడం ఆగిపోయాయి. దీనితో ఆధార్ లింకింగ్ డేట్ మళ్ళీ పెంచారనే ప్రచారం బయటకు వచ్చింది. దీనితో Incom Tax Department ట్విట్టర్ వేదికగా  పాన్ ఆధార్ లింకింగ్ డేట్ పొడిగించలేదని చెప్పింది.

అయితే ఆధార్ పాన్ పేమెంట్ చేసిన తరువాత వచ్చే చలాన్ డౌన్లోడ్ చేసుకోవడానికి చాలా మంది పాన్ కార్డ్ హోల్డర్స్ ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తమ దృష్టికి వచ్చిందని తెలుపుతూ ఇలాంటి వారు పోర్టల్లో లాగిన్ అయిన తరువాత E Pay Tax ట్యాబ్ ఓపెన్ చేసి చలాన్ పేమెంట్ హిస్టరీ కనిపిస్తుంది.అక్కడ చలాన్ స్టేటస్ సక్సెస్ అని వస్తే  పాన్ హోల్డర్స్ ఆదార్ లింకింగ్ చేసుకోవచ్చని తెలిపింది.

అయితే చివరి గడువు ముగుయడంతో చాలామంది పాన్ కార్డ్ హోల్డర్స్ కు కొన్ని సందేహాలు ఉన్నాయి వాటిలో పూర్వం చాలాన్ కట్టిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వెయ్యి రూపాయల చలాన్ తీయనవసరం లేదు. ఇక ప్రోసెస్ అంతా పూర్తి చేసి లింక్ చేసిన వాళ్ళ కు ప్రాసెస్ ఇన్ ఆపరేటీవ్ అని వచ్చినా సరే కార్డ్ తిరిగి యాక్టీవ్ అవ్వడానికి 30 రోజుల సమయం పడుతుంది. ఉదాహరణకు జూలై 01 లోపు  PAN Aadhaar Link కంప్లీట్ చేసినా కూడా 30 రోజుల తరువాత మాత్రమె అది యాక్టివేట్ అవుతుంది అప్పటి వరకూ ఇన్ యాక్టీవ్ లో ఉంటుంది..  

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular