గురువారం, ఫిబ్రవరి 29, 2024
Homeసినిమాఆదిపురుష్ సినిమా ప్రదర్శించే దియేటర్లలో హనుమంతునికి కూడా ఒక సీట్ కేటాయింపు

ఆదిపురుష్ సినిమా ప్రదర్శించే దియేటర్లలో హనుమంతునికి కూడా ఒక సీట్ కేటాయింపు

దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఆదిపురుష్ నామ స్మరణతో మారుమోగుతోంది. రేపు ప్రీరిలీజ్ ను తిరుపతి లో శ్రీ వేంకటేశ్వర యోనివర్సిటీ స్టేడియం లో భారీఎత్తున జరగనుంది ఈ ప్రీరిలీజ్ ఫంక్షన్ కి సుమారు లక్ష మంది ప్రభాస్ ఫ్యాన్స్ వస్తారని అంచనా వేస్తున్నారు.

ఈ ప్రీరిలీజ్ వేడుకకు ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ మరియు బాలీవుడ్ నుండి పెద్దలకు ఇప్పటికే ఆహ్వానాలు పంపించారు. ఇక డివోషనల్ సినిమా కావడంతో ఈ ఫంక్షన్ కు చినజీయర్ స్వామి వస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమా నుండి మరొక కొత్త ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. అంతేకాక ఈ ఈవెంట్ కు యాంకర్ సుమ తో పాటు హనుమాన్ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మరియు హీరో తేజ సజ్జ కూడా యాంకరింగ్ లో పాల్గొననున్నారు.

ఇక సినిమా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ సినిమాను రిలీజ్ చేసే ప్రతీ దియేటర్ లో ఒక సీట్ విక్రయించకుండా ఆ సీట్ హనుమంతుని కోసం కేటాయిస్తున్నారు దీనికి ప్రధాన కారణం ఎక్కడెక్కడ రామాయణం, రామ నామం పారాయణం జరుగుతుందో అక్కడకు హనుమంతుడు వస్తాడనేది పురాణం లో చేప్పబడుతుంది అంతటి రామ భక్తుడు కావున ఆ హనుమంతులవారికి మనం ఇచ్చే గౌరవంతో ఒక సీట్ ఆయన కోసం కేటాయిస్తున్నారు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular