శుక్రవారం, జూలై 26, 2024
Homeజాతీయంఆంద్రప్రదేశ్ లోని దోనకొండకు రానున్న అత్యాధునిక నేవీ బేస్

ఆంద్రప్రదేశ్ లోని దోనకొండకు రానున్న అత్యాధునిక నేవీ బేస్

దేశ వ్యాప్తంగా ఇప్పటికే పలు నేవీ బేస్ ల ఆదునీకరణలో బాగంగా తాజాగా ఆంద్రప్రదేశ్ లోని దొనకొండ వద్ద నేవీ బేస్ ను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఈ బేస్ ఆత్యాధునిక టెక్నాలజీతో నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఈ బేస్ ముఖ్యంగా దేశంలో ఉన్న అనేక నేవీ బేస్ లతో అనుసంధానం చేయబడుతుంది.

ఇప్పటికే మన దేశంలో ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, గోవా, గుజరాత్,మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, వంటి రాష్ట్రాలలో ఈ నేవీ బేస్ లు ఉండగా దేశం లో సుమారు 30 కి పైగా నేవీ బేస్ లు ఉన్నాయి. ఇక మన రాష్ట్రంలో ఇప్పటికే విశాఖపట్నంలో ఒక బేస్ ఉండగా తాజాగా కేంద్ర ప్రభుత్వం దోనకొండలో మరో నేవీ బేస్ తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వంతో పాటు నేవీ అధికారులు కసరత్తు మొదలుపెట్టారు.

ఈ నేపద్యంలో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నేవీ బేస్ నిర్మాణానికి  2600 ఎకరాల భూమి సమీకరణను కోరినట్లు తెలుస్తోంది. దీనిలో బాగంగా  సోయల్ టెస్ట్ (మట్టి పరీక్షలు) నిమిత్తం ఆ ప్రాంతానికి చెందిన మట్టి నమూనాలను లేబ్ కి పంపినట్లు తెలుస్తోంది. ఇక ఈ నేవీ బేస్ ను అత్యాధునిక టెక్నాలజీ తో “అల్ట్రా లో ఫ్రీక్వెన్సీ సిస్టం” ఇందులో పొందుపరచానున్నారు. 

దీని ద్వారా శత్రు దేశాల రాడార్లకు దొరకడం దాదాపు అసాద్యం. ఇక ఈ బేస్ లో అణుజలాంతర్గాములు సైతం ఇక్కడ నుండే పని చేయ్యనున్నాయి. దీనితో పాటు దొనకొందలోని ఈ బేస్ నుండే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సైతం ఇక్కడ జాయింట్ కమాండ్ సెంటర్ నిర్మించే అవకాసం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదే నిజమైతే జలాంతర్గాములతో పాటు ఫ్రిగేడ్స్, కల్వర్ట్స్, యుద్ద నౌకలు సైతం ఇక్కడి నుండే తమ కార్యకలాపాలను నిర్వహిస్తాయి. ఇక ఏపీ లోని మచిలీపట్నం, శ్రీకాకుళం పోర్ట్ లలో పలు సవాళ్లు ఎదురౌతుండడంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వీటిని త్వరితగతిన పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.        

 

 

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular