ప్రస్తుతం అమెరికాలో కరోనా కేసులతో ఆ దేశంప్రపంచంలోనే మొదటి స్థానంలోకి వచ్చే పరిస్థితి నెలకొనడంతో అక్కడి ప్రజలు కరోనాతో రోజుకి సుమారు రెండువేల మంది మృత్యువాత పడుతున్నారు. అయితే అమెరికా ప్రసిడెంట్ ట్రంప్ కొన్నిరోజులుగా కరోనా వ్యవహారంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
మొన్న WHO (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) చైనాలో కరోనా ప్రభావం ఉన్నా అది బయటకు తెలియకుండా WHO మేనేజ్ చేసిందని ట్రంప్ WHO కు ఇచ్చే నిధులను ఆపేశారు. ప్రస్తుతం చైనా అంటేనే అమెరికా, జపాన్ , ఇటలీ వంటి దేశాలు మండిపడుతున్నాయి. ఈ తరుణంలో అమెరికా యుద్దనౌకలు దక్షిణ చైనా జలాల దగ్గరగా గత కొద్ది రోజులుగా అక్కడే పాగా వేశాయి.

దీనితో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని అందరూ బయపడుతున్న తరుణంలో ఈ రెండు దేశాలకు మద్యలో ఇరాన్ వచ్చి చేరింది. రెండు రోజులుగా ఇరాన్ కు సంబంధించిన యుద్ద విమానాలు మరియు యుద్ద నౌకలూ అమెరికా జలాల దగ్గరగా వెళ్లి అమెరికా పై కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది.
అసలే కరోనా దెబ్బకు తలపట్టుకున్న ట్రంప్ కోపంతో ఇకపై ఇరాన్ వైపు నుండి సముద్ర జల్లాల్లోకి యుద్ద విమానాలు గాని, యుద్ద నౌకలు గాని వచ్చి కవ్వింపు చర్యలకు పాల్పడితే వెంటనే ఆలోచించకుండా పేల్చి పడేయమని అదేశాలిచ్చారు. ఈ విషయాన్ని ట్రంప్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తమ నేవీ కి ఈ సందేశాన్నిచ్చారు.

అయితే ఇరాన్ మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ మరియు ఆదేశ నిఘా విభాగం అధిపతి కాసిం సోలేమాని ని జనవరిలో అమెరికా బాగ్దాద్ లో డ్రోన్ క్షిపనులతో అంతమందించింది. ఈ ఘటనపై కొన్నాల్లనుండి ఆగ్రహంగా ఉన్న ఇరాన్ ఇప్పుడు కవ్వింపు చర్యలకు దిగుతుంది.
అయితే ట్రంప్ ఎప్పుడు ఎలా ప్రవర్తిస్థారో ఎవరికీ తెలియదు. ఇలాటి సమయంలో కవ్వింపు చర్యలకు పాల్పడితే అమెరికా తమ దేశంపై దాడికి దిగితే అది ఇరాన్ కోలుకోలేని పరిస్థితి ఉంటుందని పలు దేశాలు సూచిస్తునాయి.