గురువారం, ఏప్రిల్ 18, 2024
Homeటెక్నాలజీఅదరగొడుతున్న Ola Electric Scooter 24 గంటల్లో లక్ష ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ల బుకింగ్

అదరగొడుతున్న Ola Electric Scooter 24 గంటల్లో లక్ష ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ల బుకింగ్

ఇంధన ధరలు పెరుగుదలతో ప్రయాణించే వాహనం బయటకు తియ్యాలంటేనే వాహనదారులు బయపడుతున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వాడకం చాలా వరకూ పెరిగింది మునుపటి సంవత్సరం జరిగిన సేల్స్ కంటే ఈ సంవత్సరం రెట్టిపు ఎలాక్ర్టిక్ వాహనాల సేల్స్ జరిగినట్లు కంపెనీలు చెబుతున్నాయి. ఇప్పటికే అనేక కంపెనీల ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు కొనసాగుతున్న తరుణంలో తాజాగా క్యాబ్ సర్వీస్ లలో పేరుగాంచిన ఓలా సంస్థ తీసుకువచ్చిన Ola Electric Scooter పైనే అందరి చూపూ పడింది.  

ఇప్పటికే పలు బడా కంపెనీల Electric Scooters వాహన దారులను ఆకర్షిస్తున్న విషయం తెలిసిందే అందుకే వీటన్నిటికీ పోటీగా సరికొత్త ఫ్యూచర్స్ తో Ola Electric Scooter త్వరలో మార్కెట్ లోకి లాంచ్ అవ్వబోతోంది. ప్రధానంగా ఎలక్ర్టిక్ వాహనాలంటేనే చాలా మందిలో ఒక అపనమ్మకం ఏర్పడింది దీనికి ప్రధాన కారణం ఆ వాహనాల చార్జింగ్ పాయింట్స్ మరియు వాహనం యొక్క బ్యాటరీ కెపాసిటీ మరియు సర్వీస్ సెంటర్లు వంటి అనుమానాలతో చాలా మంది వెనుకడుగు వేసేవారు.

 24 గంటల్లో లక్ష ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ల బుకింగ్

ప్రస్తుతం ఓలా తీసుకువచ్చిన  Ola Electric Scooter తాజాగా సేల్స్ విషయంలో బుకింగ్ స్టార్ట్ చేసిన 24 గంటల సమయంలోనే ఏకంగా 1లక్షకు పైగా బుకింగ్ రావడం ఓలా ఎలాక్రిక్ బైక్ పై ఏ స్థాయిలో అమ్మకాలు జరుగుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ బైక్ లాంచింగ్ డేట్ విషయానికి వస్తే ఈనెల 15న తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.

Ola Electric Scooter Specifications In Telugu

ఇక Ola Electric Scooter Charging Capacity విషయానికి వస్తే ఒక్క సారి చార్జింగ్ పెడితే 150 కిలో మీటర్ల వరకూ ప్రయాణిస్తుందని ఒక లీక్ బయటికి వచ్చింది. తర్వాత ఈ స్కూటర్ ధర విషయానికి వేస్తే లక్ష నుండి లక్షా పదివేల రూపాయల వరకూ ఉంటుందని అనఫిషియల్ గా తెలుస్తోంది. ఇక ప్రధానంగా ఎలక్ట్రిక్ స్కూటర్ లలో ప్రధానంగా స్పీడ్ 60-80 వరకూ ఉంటుంది. ఓలా స్కూటర్ టాప్ స్పీడ్ గంటకి 100 కిలోమీటర్లుగా ఉండనుంది.

అంతే కాక ఈ స్కూటర్ లో బ్లూటూత్ కనెక్టివిటీ తో పాటు ఇంటర్నెట్ కనెక్టివిటీ తో పాటు డిజిటల్ డిస్ప్లే సెట్టింగ్స్ వంటి అనేక సదుపాయాలు కల్పిస్తోంది. మొత్తం పది కలర్స్ లలో ఈ స్కూటర్ని విడుదల చేయ్యనుంది కంపెనీ. ఇక ప్రధానంగా చెప్పుకోవ్వాల్సిన విషయం చార్జింగ్ 18 నిమిషాల్లో 75 శాతం చార్జింగ్ ఎక్కుతుంది.

Ola Electric Scooter Charging Points

ఇక ఈ చార్జింగ్ పాయింట్లపై ఓలా ఎలక్ట్రానిక్ విభాగం చాలా చోట్ల ఈ పాయింట్లపై కసరత్తు మొదలు పెట్టింది. తాజా సమాచారం ప్రకారం ఇప్పటికే దేశంలో ఉన్న 100 ప్రధాన నగరాలలో ఈ చార్జింగ్ పాయింట్లు త్వరలో అమర్చనున్నాయి. ఇక మిగతా కంపెనీల పోటీని తట్టుకుని ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కశ్చితంగా నిలబడుతుందని సీఈవో భావిష్ అగర్వాల్ అంటున్నారు. అంతేకాక వచ్చే సంవత్సర కాలంలో పది లక్షల్ ఓలా స్కూటర్ ల ఉత్పత్తి సామర్ధ్యం గల ప్లాంట్ ఇప్పటికే తమిళనాడులో నిర్మించారు.

 Ola Electric Scooter Subsidy

ప్రధానంగా ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకునే వారిలో ముఖ్యంగా తలెత్తే ఒక డౌట్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు కేంద్ర ఇచ్చే సబ్సీడీపై ఇప్పటికే చాలా మందిలో అనేక ప్రశ్నలు తలెత్తుతాయి. ఇక ఈ స్కూటర్ విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం కిలోవాట్ సామర్ధ్యం గల బ్యాటరీ ఆధారంగా సబ్సీడీ నిర్ణయిస్తూ వస్తుంది. పూర్వం 1కిలో వాట్ కి 10,000 రూపాయల సబ్సీడీ ఇచ్చేది అయితే తాజాగా ఈ సబ్సీడీని 15,000 రూపాయల వరకూ పెందుతూ నిర్ణయం తీసుకుంది.

అయితే ఈ సబ్సీడీ డబ్బులు మనం తీసుకునే ఎలక్ట్రిక్ స్కూటర్ ధర మొత్తం లో కట్ అయ్యి వస్తుంది. అంటే ఇప్పుడు మనం చెబుతున్న ఓలా స్కూటర్ రేటు లక్షా పదిహేనువేలు గా ఉండగా దీనిని కేంద్రం ఇస్తున్న ఇస్తున్న 15వేల సబ్సీడీ తొలగించి సుమారు లక్షకు ఇస్తున్నట్లు భావించాలి. ఇక ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం నుండి రిజిస్ట్రేషన్ ఫీజు తో పాటు రోడ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు.

Ola Electric Scooter Booking

ఇక ఈ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్ 499 రూపాయలతో olaelectric.com అనే వెబ్సైటు ద్వారా దీనిని అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చని సీఈవో భావీష్ అగర్వాల్ తెలిపారు.  

ఇవి కూడా చదవండి…డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లేకుండానే ఇకపై e-RUPI Digital Payment  

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular