స్టార్ ప్లేయర్ జకోవిచ్ ను వదలని కరోనా

0
236
novak Djokovic corona effect
novak Djokovic corona effect

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్.. టెన్నిస్‌లోనూ కలకలం రేపుతోంది. ఇప్పటికే టెన్నిస్ స్టార్లు గ్రిగోర్ దిమిత్రోవ్, బోర్నా కొరిచ్ ఈ మహమ్మారి బారిన పడగా.. తాజాగా వరల్డ్ నెంబర్ వన్ నోవాక్ జకోవిచ్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ మేరకు జకోవిచ్ స్వయంగా వెల్లడించాడు. తన భార్యకు కూడా కరోనా సోకిందని కానీ తన పిల్లలకు మాత్రం నెగిటివ్ వచ్చినట్లు ప్రకటించాడు.

ఈ టోర్నీ లో జకోవిచ్ తో పాటు మరో ముగ్గురు ఆటగాళ్లకు కొన్నిరోజులక్రితం కరోనా పాజిటీవ్ గా తేలింది. అయితే జకోవిచ్ మాట్లాడుతూ “బెల్ గ్రేడ్” లోకి మా ఫ్యామిలీ రాగానే కరోనా టెస్టులు చేయించుకున్నా వాటిలో నేగిటీవ్ వచ్చిందన్నాడు. తాను మాత్రం మంచి సంఖల్పంతో ఈ టోర్నీ జరపాలనుకున్నానని అన్నాడు.

తన ఆశలు అడిఆశలు అయ్యాయని పేర్కొన్నాడు. ఇకపై తాను స్వీయ నిర్బండంలో ఉంటానని తెలిపాడు. జకోవిచ్ ఈ టోర్నీ మొదలుపెట్టిన సమయంలోనే తనపై పలు విమర్శలోచ్చాయి. ఇలాంటి టైం లో టోర్నీ నిర్వహించాల్సిన అవసరం ఏమిటని పలువురు తనపై విమర్శలు గుప్పించారు.