చంద్రబాబుకి నోటీసులు …. శివాజీ..! | Chandrababu naidu news

0
71
hero sivaji coments about ap cm chandrababu

సినీ నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేసారు ఏపీని టార్గెట్ చేస్తూ ఆపరేషన్ గరుడ పేరుతో పెద్ద కుట్ర జరుగుతున్నట్లు గతంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు అప్పట్లో దీనిపై పెద్ద చర్చే జరిగింది. ఇప్పుడు మరోసారి ఆపరేషన్ గరుడ గురించి వ్యాక్యాలు చేస్తూ ఏపీ సిఎం చంద్రబాబు కు రెండురోజుల్లో రాజ్యాంగ బద్ద  సంస్థ నుంచి నోటీసులు వస్తాయని చెప్పారు.

కానీ ఏ సంస్థ నుండి వస్తాయన్న విషయం తనకు తెలియదన్నారు అవి నేను చెప్పకూడని విషయాలని, అవన్నీ చెబితే తనకు ప్రాణహానీ ఉందని ఆందోళన వ్యక్తం చేసారు. ఈ విషయం నేను బయటపెట్టాను కావున సోమవారం నోటీసులు రాకపోవచ్చన్న అనుమానం కూడా వ్యక్తం చేసారు అయితే ఢిల్లీ నుంచి తనకు వస్తున్న సమాచారం ప్రకారం మరో వారం రోజులలోనైనా చంద్రబాబుకు నోటీసులు వస్తాయన్నారు.

 

సీఎం chandrababu naidu అడ్డు తొలగించేందుకే ఒక జాతీయ పార్టీ కుట్రకు తెరలేపిందన్నారు కొందరు నచ్చని ముఖ్యమంత్రులు, వ్యక్తులను టార్గెట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. చంద్రబాబుని ఇరుకున పెట్టేందుకు తిరుపతిలో ఎదోజరుగుతోందంటూ స్వామీజీలూ, కొన్ని సంఘాలు, మరియు పార్టీలతో కలిసి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

శుక్రవారం అర్ధరాత్రి తనకు ఒక ఫోన్ కాల్ వచ్చిందని చెప్పిన ఆయన ప్రజా సమస్యల గురించి పట్టించుకోవడం మానేసి రాజకీయ డ్రామాలు ఆడుతున్నారన్నారు శివాజీ చేసిన వ్యాక్యాలు ఇప్పుడు సంచలనంగా మారాయి.